న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చైర్మన్ పీసీ మోదీ నియమితులయ్యారు. నియామక ఉత్తర్వులపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సంతకం చేశారు. పీసీ మోదీ ఇవాళ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా ఉన్న డాక్టర్ పీపీకే రామాచార్యులు అడ్వయిజర్‌గా నియమితులైనట్టు సమాచారం. డాక్టర్ రామాచార్యులు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఎస్జీగా ఉన్నారు.