‘కొత్త డీఏలతో పాత జీతాలు చెల్లించాలి’

ABN , First Publish Date - 2022-01-29T05:11:09+05:30 IST

కొత్త డీఏలు కలుపుకొని పాత జీతాలనే చెల్లించాలని ఏపీ మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నంద్యాల శాఖ అధ్యక్షుడు కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

‘కొత్త డీఏలతో పాత జీతాలు చెల్లించాలి’

నంద్యాల(నూనెపల్లె), జనవరి 28: కొత్త డీఏలు కలుపుకొని పాత జీతాలనే చెల్లించాలని ఏపీ మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నంద్యాల శాఖ అధ్యక్షుడు కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలోని మున్సిపల్‌ కమిషనర్‌కు ఏపీఎంటీఎఫ్‌ నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పాత జీతాలు చెల్లించకుండా ప్రకటించిన పీఆర్‌సీ ప్రకారమే జీతాలు ఇస్తామనడం ప్రభుత్వానికి సరికాదని అన్నారు. ప్రకటించిన పీఆర్‌సీ ప్రకారం కాకుండా, పాత జీతాలనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పుల్లయ్య నాయక్‌, ఈశ్వరరెడ్డి, మహేందర్‌రెడ్డి, యల్లయ్య, రవితేజ, జమీల్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు. 


చాగలమర్రి: పాత పీఆర్సీ ప్రకారం కొత్త డీఏలతో జనవరి నెల జీతాలు ఇవ్వాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు ప్రసాదు, జయరాజు కోరారు. శుక్రవారం చాగలమర్రి ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో అనూరాధకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వరాదని అన్నారు.  కార్యక్రమంలో ఎస్టీ యూ సంఘ నాయకులు నరసింహుడు, శేషాద్రి,  అబ్దుల్‌ఖాదర్‌, మునయ్య  పాల్గొన్నారు. 


రుద్రవరం: జనవరి నెల జీతాలు పాత పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుబ్బయ్య, సుభహాన్‌, సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో సిబ్బంది శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసును అమలు చేయాలని, సీపీఎ్‌సను రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను యఽథాతథంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2022-01-29T05:11:09+05:30 IST