Maharashtra: పవార్ వల్లే పార్టీలో చీలిక: రాందాస్ కదమ్

ABN , First Publish Date - 2022-07-20T01:57:07+05:30 IST

శివసేన పార్టీలో చీలికకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవారే కారణమని ఏక్‌నాథ్ షిండే వర్గం మ్మెల్యే రామ్‌దాస్

Maharashtra: పవార్ వల్లే పార్టీలో చీలిక: రాందాస్ కదమ్

ముంబై: శివసేన పార్టీలో చీలికకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవారే (Sharad pawar) కారణమని ఏక్‌నాథ్ షిండే వర్గం మ్మెల్యే రామ్‌దాస్ కదమ్ (Ramdas Kadam) ఆరోపించారు. చాలాకాలం నుంచి పార్టీని చీల్చాలనే ఆలోచన పవార్‌కు ఉందని, అయితే బాలాసాహెబ్ థాకరే ఉండటం వల్ల ఆయన ఆపని చేయలేకపోయారని అన్నారు.


''బాలాసాహెబ్ వల్ల శివసేనను చీల్చే అవకాశం పవార్‌కు రాలేదు. ఆ తర్వాత ఉద్ధవ్‌ను సీఎం చేశారు. కోవిడ్ వల్ల ఉద్ధవ్ 6 నెలలుగా బయటకు రాలేకపోయారు. ఆ అవకాశాన్ని పవార్ ఉపయోగించుకున్నారు'' అని రామ్‌దాస్ కదమ్ చెప్పారు. తాను శివసేన ఎమ్మెల్యే అయినప్పటికీ తన నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోలేక పోయానని ఆయన వాపోయారు. ఈ అవకాశాన్ని ఎన్‌సీపీ ఉపయోగించుకుందని, కానీ తమ ప్రాంతంలో శివసేన బలహీనపడిందని అన్నారు. ఈ విషయం పలుమార్లు ఉద్ధవ్ దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. శివసేన తనయుడు (ఉద్ధవ్) ఎన్‌సీపీతోనూ, కాంగ్రెస్ మంత్రితోనూ కలిసి ఉండటం తమకు ఇష్టం లేదని అన్నారు. ఏక్‌నాథ్ షిండే సరైన నిర్ణయం తీసుకుని ఉండకపోతే వచ్చే ఎన్నికల్లో శివసేనకు 10 మంది ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చుండేవి కావని అన్నారు. 52 ఏళ్లుగా పార్టీలో ఉన్నాయని, పార్టీ కోసం పనిచేశానని, అలాంటి తనను బహిష్కరించారని, ఈరోజు నుంచి తాను షిండేతోనే ఉంటానని రాందాస్ చెప్పారు.

Updated Date - 2022-07-20T01:57:07+05:30 IST