‘పసిడిపురిలో పట్టా ఫట్‌ వాస్తవమే

ABN , First Publish Date - 2022-05-25T05:05:38+05:30 IST

ప్రొద్దుటూరు లో పట్టా భూముల కబ్జాపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘పసిడిపురిలో పట్టా ఫట్‌’ కధనం వాస్తవమని ఆంధ్రజ్యోతి కధనంపై తహసీల్దారు సబ్‌రిజిస్ర్టార్‌ అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు.

‘పసిడిపురిలో పట్టా ఫట్‌ వాస్తవమే
పేపర్‌ చూపుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి

సెంటు భూమి ఆక్రమించినా ఊరుకోను - భూ కబ్జాలకు వైసీపీ వ్యతిరేకం 

కబ్జాదారులు వైసీపీ నేతలైనా వదలను - ఆంధ్రజ్యోతి కఽథనంపై స్పందించిన ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు అర్బన్‌ మే 24: ప్రొద్దుటూరు లో పట్టా భూముల కబ్జాపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘పసిడిపురిలో పట్టా ఫట్‌’ కధనం వాస్తవమని ఆంధ్రజ్యోతి కధనంపై తహసీల్దారు సబ్‌రిజిస్ర్టార్‌ అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. తహసీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తాళ్ళమాపురం రెవె న్యూ పరిధి పట్టా భూముల్లో 30 ఏళ్ళ కింద ట బాలాజి కాలనీ పేర లేఅవుట్‌ వేసి ప్లాట్లు గా విక్రయించారన్నారు. అది వాస్తవానికి నివాసయోగ్యమన్నారు. ఆ భూమిని వీలున్నకాడికి ఆక్రమణదారులు సొమ్ముచేసు కునే వీలున్న అన్నిరకాల మోసాలు చేయడానికి ప్రయత్నాలు చేశారన్నారు. ఎమ్మెల్యేగా ప్రజ ల ఆస్తులు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తనదేనన్నారు.

ఇటీవల కొందరు రౌడీలు కబ్జాదారులు కొత్తపల్లి పంచాయితీలో భూ ములు, డీకేటీ పట్టాలు, రెవెన్యూ భూములు కాజేయడం, సరైన యజమానిలేడని తెలు సుకుంటే ఆభూములను ఏదో ఒకరూపంలో కొట్టేసే ప్రయత్నాలు చేయడానికి కొన్ని బ్యాచులు తీరుగుతున్నాయన్నారు. దీనిపై ఎస్పీ, కలెక్టరుకు ఫిర్యాదు చేశానన్నారు. భూముల విషయమై చిన్న మోసం జరిగినా న్యాయం చేస్తానన్నారు. సమావేశంలో తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ సబ్‌రిజిస్ర్టార్‌ విద్యాసాగర్‌రెడ్డి కొత్తపల్లిపంచారుతీ కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:05:38+05:30 IST