లక్షణాలు స్వల్పంగా ఉంటే.. 9 రోజుల్లో కోలుకుంటారు!

ABN , First Publish Date - 2020-08-08T07:00:49+05:30 IST

స్వల్ప లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులు 9 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి వారిలో 9 రోజుల తర్వాత కూడా వైరస్‌ మూలాలు బయటపడటం చాలా అరుదని...

లక్షణాలు స్వల్పంగా ఉంటే.. 9 రోజుల్లో కోలుకుంటారు!

బీజింగ్‌, ఆగస్టు 7: స్వల్ప లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులు 9 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి వారిలో 9 రోజుల తర్వాత కూడా వైరస్‌ మూలాలు బయటపడటం చాలా అరుదని, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో మాత్రమే అలా జరిగే అవకాశం ఉంటుందని తేలింది. ఈ అధ్యయనం ఇటీవల జర్నల్‌ ఎమర్జింగ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌సలో ప్రచురితమైంది.


హాంకాంగ్‌లోని 35 మంది కొవిడ్‌ రోగుల నుంచి సేకరించిన 68 శ్వాసకోశ నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వీరిలో స్వల్ప లక్షణాలు ఉన్న 32 మందిలో 9 రోజుల తర్వాత వైరస్‌ జన్యువుల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఇలాంటి వారు తమ నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమించకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. అదే వారికి సరైన మందు అని తెలిపారు.

Updated Date - 2020-08-08T07:00:49+05:30 IST