పదిలో అంతా పాస్‌

ABN , First Publish Date - 2021-05-17T05:37:41+05:30 IST

కరోనా మరోసారి విజృంభించ డంతో గత నెల 15న పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభు త్వం ప్రకటించింది.

పదిలో అంతా పాస్‌

- జిల్లా వ్యాప్తంగా 13,473 మంది విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 16 : కరోనా మరోసారి విజృంభించ డంతో గత నెల 15న పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభు త్వం ప్రకటించింది. దీంతో పది పరీక్షలు వరుసగా రెండోసారి రద్దయ్యాయి. ఇందుకు సంబంధించి విద్యార్థుకు నిర్వహించిన ఎస్‌ఎ-1, ఎస్‌ఎ-2, ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం జిల్లా విద్యాశాఖ జిల్లా మొత్తం పది విద్యార్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. జిల్లాలో మొత్తం 13,473 మంది విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కుల వివరాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు పంపించినట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు.  ఇందులో బాలికలు 6805 మంది ఉన్నారు. బాలురు 6668 ఉన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలకు సంబంధించి 213 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పది విద్యార్థులు 1097మంది,  కస్తూర్బా విద్యాలయాలలో చదివిన విద్యార్థులు 559 మంది, ఆదర్శ పాఠశాలల్లో 98మంది విద్యార్దులు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పది విద్యార్థులు 6263 మంది ఉండగా, ప్రైవేట్‌ పాఠశాలల్లో చెందిన 3732 మంది, గురుకుల, రెసిడెన్సియల్‌ పాఠశాలకు చెం దిన 1,511మంది విద్యార్థుల పదిలో పాస్‌ అయినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించిన గ్రేడింగ్‌ పాయింట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన గ్రేడింగ్‌లో కూడిన విద్యార్థుల మెమోలు త్వరలోనే రానున్నాయని సెక్టోరియల్‌ అధికారి వెంకట్‌రామ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-05-17T05:37:41+05:30 IST