కనుల పండువగా పార్వేట ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-01-16T05:11:29+05:30 IST

మకర సంక్రాంతిని పురష్కరించుకుని వివిధ ఆలయాల్లో కనుమ పండుగ రోజైన శుక్రవారం సాయంత్రం పార్వేట ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు.

కనుల పండువగా పార్వేట ఉత్సవాలు
ప్రొద్దుటూరు పార్వేట ఉత్సవంలో ముకి ్తరామలింగేశ్వరస్వామి

ప్రొద్దుటూరు టౌన్‌, జవనరి 15: మకర సంక్రాంతిని పురష్కరించుకుని వివిధ ఆలయాల్లో కనుమ పండుగ రోజైన శుక్రవారం సాయంత్రం పార్వేట ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. బొల్లవరంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, రామేశ్వరంలోని ముక్తిరామలింగే శ్వరస్వామి ఆలయం, నరసింహాపురంలో నరసింహాస్వామి ఆలయంలో పార్వేట ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి నూతన పట్టువస్త్రాలతో, వెండికవచాలతో రంగు రంగుల పూలమాలతో శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం స్వామివారిని సుం దరంగా పల్లకీలపై అలంకరించి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. పార్వేట ఉత్సవాన్ని తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల రాకతో పార్వేట ఉత్సవం సందడిగా మారింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. అనంతరం పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

రాజుపాళెంలో..

రాజుపాలెం, జనవరి 15: మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రము ఖ పుణ్యక్షేత్రమైన  చెన్నకేశవ, భీమలింగేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. కనుమ  పండుగ పురస్కరించుని శుక్రవారం  సోమేశ్వర, పార్వతీదేవి, శ్రీమదనగోపాల లక్ష్మీదేవిల ఉత్సవ విగ్రహాలను అత్యంత వైభవంగా ఊరేగింపు  నిర్వ హించారు. విగ్రహాల వెంబడి చెక్కభజనలు, డప్పువాయిద్యాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా టంగుటూరు మదనగోపాల స్వామి ఆలయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి టెంకాయ కొట్టి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో వెల్లాల ఈవో వోభారా ణి, టంగుటూరు ఈవో బాబు, వైసీపీ నాయకులు వెలవలినారా యణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి పగిడాల భలరాంరెడ్డి, గోపల్లెగోవర్దన్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నడిపన్న పాల్గొన్నారు. 

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 15 జమ్మలమడుగులో సంక్రాంతి పర్వదినం పురష్కరించుకుని పార్వేట ఉత్సవాలు ఆయా గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు. మండలంలోని గొరిగెనూరు, సున్నపురాళ్లపల్లె తదితర గ్రామాల్లో  చెన్నకేశవస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే దొమ్మరనంద్యాల గ్రామంలో శుక్రవారం సాయంత్రం  చెన్నకేశవస్వామి ఆలయం వద్ద నుంచి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మరనంద్యాల  చెన్నకేశవస్వామి ఆలయ ధర్మకర్త రామచంద్రారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల సుబ్బిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శంకర్‌, గొరిగెనూరు గ్రామంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

కనుమ సందర్భంగా ప్రత్యేక పూజలు

ఎర్రగుంట్ల, జనవరి 15: సంక్రాంతి వేడుకల్లో భాగంగా కనుమ పండుగ రోజైన శుక్రవారం  నడివూరులోని రామాలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా పారువేటకు అనుమతి లేకపోవడంతో ఆలయం చుట్టుపక్కల, ఆలయంలోనే ఆంజనేయస్వామి వారికి భజన కార్యక్రమాలు నిర్వహించారు.  ఆలయ ధర్మకర్త జి.రామసుబ్బారెడ్డితో పాటు నడివూరు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. 

మైలవరంలో..

మైలవరం, జనవరి 15 : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కనుమ పండుగ రోజు ఆలయాల్లో పార్వేట ఉత్సవాలను వైభవంగా నిర్వహిం చారు.  పార్వేట ఉత్సవాల్లో యువత పాల్టొని పోటీ పడ్డారు. పలువురు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.




Updated Date - 2021-01-16T05:11:29+05:30 IST