హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలి

ABN , First Publish Date - 2021-06-18T04:49:02+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టనున్న హరితహారంపై ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

కాగజ్‌నగర్‌, జూన్‌ 17: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టనున్న హరితహారంపై ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాల యంలో పాలకవర్గ సభ్యులతో అభివృద్ధి పనులు, తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే హరితహార కార్యక్రమంపై పాలకవర్గ సభ్యులంతా దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా పెంచే బాధ్యత కూడా ప్రతిఒక్క కౌన్సిలర్‌ విధిగా తీసుకోవాలని సూచించారు.

ప్రధానంగా 30వార్డుల్లో మినీనర్సరీలు, పార్కు లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్యంపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించి వర్షం నీరు విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల న్నారు.  హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యులు కావాలన్నారు. 

అదనపు కలెక్టర్‌ రాజేశం మాట్లాడుతూ మున్సి పాల్టీ అభివృద్ధికి బాటలు వేసేందుకు చక్కటి ప్రణా ళిక రూపొందించాల న్నారు. ప్రతి వార్డులో మినీ నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ మాట్లాడుతూ మున్సిపాల్టీలో పట్టణ జనాభాకు సరిపడేట్టు పారి శుధ్య సిబ్బంది లేరన్నారు. ఇందుకు అదనంగా పారిశుద్య సిబ్బందిని నియమించేట్టు సహకరించా లన్నారు. వైస్‌చైర్మన్‌ గిరీష్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పాలొన్నారు.

Updated Date - 2021-06-18T04:49:02+05:30 IST