హరితహారంలో భాగస్వాములవ్వాలి

ABN , First Publish Date - 2021-06-22T05:35:28+05:30 IST

హరితహారంలో భాగస్వాములవ్వాలి

హరితహారంలో భాగస్వాములవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి

కీసర: హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం కీసరలో కలెక్టర్‌ శ్వేత మహంతి అధ్యక్షతన హరితహారంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు నాటాలన్నారు. హరితహారం కింద ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ ప్రదేశాల్లో భారీ సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించా ల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని మంత్రి అన్నారు. ప్రభుత్వ పథకాల జిల్లా, మండల, గ్రామాల అఽధికారుల పనితీరు బాగుందన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్‌ యా ర్డులు, పల్లెప్రకృతి వనాలు, కంపోస్టు ఎరువు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని, వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటవీ సంపదను వృద్ధి చేసేలా మొక్కలను సంరక్షించాలని, వాటికి జియో ట్యాగింగ్‌ చేయాలని జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. 


  • 63 లక్షల మొక్కలు లక్ష్యం : కలెక్టర్‌ శ్వేతామహంతి


జిల్లాలో 63లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం అని కలెక్టర్‌ శ్వేతామహంతి అన్నారు. మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. జిల్లాలో 61 పంచాయతీల్లో 61 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలని తె లిపారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 13 వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని, బయట ఎక్కడా చెత్త వేయొద్దని, కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, శాంసన్‌, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా అధికారులు, జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌. ఎంపీపీ ఎం.ఇందిర, వైస్‌ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచ్‌ మాధురి, ఉపసర్పంచ్‌ బాలామణి, ఎంపీటీసీ నారాయణశర్మ, ఎంపీడీవో పద్మావతి, ఇతర గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌ అధికారులు పాల్గొన్నారు.


  • శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దాలి


శామీర్‌పేట: దేవరయాంజాల్‌లోని చారిత్రక సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. చైర్మన్‌ సుధాకర్‌రెడ్డికి సూచించారు. తూంకుంట మున్సిపల్‌ పరిధి దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌గా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు పన్నాల సుధాకర్‌రెడ్డిని సోమవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో దేవాదాయశాఖ అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రి చైర్మన్‌ సుధాకర్‌రెడ్డిని మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌చైర్‌పర్సన్‌ పన్నాల వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను నిరంతరం పరిరక్షిస్తు, ఆలయాన్నీ కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి పర్చాలన్నా రు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ సునీతలక్ష్మి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌యాదవ్‌, దూసరి మహేశ్‌, కోనేరు సరిత, మహిపాల్‌రెడ్డి, రాహుల్‌, ఆలయ ధర్మకర్తలు, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ కందుల సీతారామచారి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:35:28+05:30 IST