పార్లమెంటులో ఏ ఎంపీ ఎక్కడ కూర్చోవాలో ఎలా నిర్ణయిస్తారో తెలుసా? ఆ ఫార్ములా ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-16T16:41:07+05:30 IST

పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు ప్రధాని, ఇతర నేతలు..

పార్లమెంటులో ఏ ఎంపీ ఎక్కడ కూర్చోవాలో ఎలా నిర్ణయిస్తారో తెలుసా? ఆ ఫార్ములా ఏంటో తెలిస్తే..

పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు ప్రధాని, ఇతర నేతలు ఒకవైపు, ప్రతిపక్ష నేతలు మరోవైపు కూర్చుండటాన్ని మీరు చూసే ఉంటారు. అయితే ఏ ఎంపీ ఎక్కడ కూర్చోవాలనేది ఎలా నిర్ణయిస్తారు? వారికి స్థిరమైన స్థలం ఉంటుందా? అనే ప్రశ్నలు మన మదిలో మెదులుతుంటాయి. వాటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. లోక్‌సభలో గెలిచిన అన్ని పార్టీల అభ్యర్థులకు బ్లాక్‌లను విభజించారు. ప్రతి బ్లాక్‌లో పార్టీల వారీగా అభ్యర్థులు కూర్చుంటారు. ప్రధానమంత్రి, ఆయన పార్టీ ఎంపీలు.. స్పీకర్‌కు ఎడమవైపు, ఇతర పార్టీ ఎంపీలు కుడివైపున కూర్చుంటారు.


మొదటి లైన్‌లో ప్రతిపక్ష నేతతో పాటు డిప్యూటీ స్పీకర్ కూర్చుంటారు. పార్టీలకు బ్లాక్‌లు ఇచ్చినప్పటికీ, ముందు వరుసలో ఎవరు కూర్చోవాలో పార్టీ తన సొంత ప్రాతిపదికన నిర్ణయిస్తుంది. అధికార పార్టీ బ్లాక్‌లోని మొదటి సీటులో పార్టీ సీనియర్ నేతలు ప్రధానితోపాటు కూర్చుంటారు. దీనితో పాటు మొదటి లైన్‌లోని సీట్లు అధికార ఎంపీలకు కేటాయిస్తారు. పార్లమెంట్‌లో సీట్ల కేటాయింపు అనేది బ్లాక్‌ ఆధారంగానే జరుగుతుంది. ఒక్కో పార్టీలో గెలిచే అభ్యర్థుల సంఖ్యను బట్టి సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలకు బ్లాక్‌లను విభజిస్తారు. అయినప్పటికీ చాలామంది పార్లమెంటు సభ్యులు తమ సీనియారిటీ ఆధారంగా కూర్చుంటారు.

Updated Date - 2022-01-16T16:41:07+05:30 IST