ఎన్నికల సంస్కరణలకు సంబంధించి లోక్‌సభలో కీలక బిల్లు

ABN , First Publish Date - 2021-12-20T19:19:43+05:30 IST

ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల సంస్కరణలకు సంబంధించి లోక్‌సభలో కీలక బిల్లు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. గత వారం కేంద్ర కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించిన కేంద్రం.. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎన్నికల చట్ట (సవరణ) 2021 పేరుతో బిల్లును కేంద్రం తెచ్చింది. ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి అనుకునేవారి గుర్తింపు పత్రంగా ఆధార్ నెంబర్‌ను అడిగే హక్కు ఎన్నికల నమోదు అధికార్లకు ఉండేలా చట్టంలో మార్పుల బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరించారు.  

Updated Date - 2021-12-20T19:19:43+05:30 IST