శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలకు పందిరిరాట

ABN , First Publish Date - 2021-03-04T04:13:09+05:30 IST

త్సవాలకు శ్రీముఖలింగం ముస్తాబైంది. ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి బుధవారం పందిరిరాట వేశారు. ఆనవాయితీ ప్రకారం దేవదాయశాఖ సిబ్బంది, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ శాశ్వత ధర్మకర్త పర్లాకిమిడి మహారాజును వేడుకలకు ఆహ్వానించనున్నట్టు నిర్వా

శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలకు పందిరిరాట
శ్రీముఖలింగంలో పందిరిరాట వేస్తున్న దేవాదాయశాఖ సిబ్బంది, అర్చకులు




శ్రీముఖలింగం (జలుమూరు), మార్చి 3: శివరాత్రి ఉత్సవాలకు శ్రీముఖలింగం ముస్తాబైంది. ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి బుధవారం పందిరిరాట వేశారు. ఆనవాయితీ ప్రకారం దేవదాయశాఖ సిబ్బంది, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ శాశ్వత ధర్మకర్త పర్లాకిమిడి మహారాజును వేడుకలకు ఆహ్వానించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 


పకడ్బందీగా ఏర్పాట్లు 

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ హరిసూర్యప్రకాష్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీముఖలింగేశ్వరాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లుపై ఆలయ ఈవో రమణయ్యతో సమీక్షించారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తులంతా మాస్క్‌లు ధరించి.. భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటేషన్‌ చేసి.. ఆలయంలోపలికి అనుమతించాలన్నారు. క్యూలో భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు, చలువ పందిళ్లు వేయాలని సూచించారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని తెలిపారు. చక్రతీర్థ స్నానాలకు సంబంధించి అదనపు బలగాలను తెప్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సూపరింటెండెంట్‌ ఎం.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌బాబు, ఎస్‌.ఐ వై.కృష్ణ, దేవదాయ సిబ్బంది నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, దాసు, అర్చకులు బంకుపల్లి ప్రభాకరశర్మ, పెద్దలింగన్న, నారాయణమూర్తి, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-04T04:13:09+05:30 IST