పల్లె దవాఖానాకు వైద్యులు దూరం

ABN , First Publish Date - 2021-10-29T04:59:02+05:30 IST

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కానీ పల్లెల్లో పనిచేయడానికి డాక్టర్ల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్‌సబ్‌సెంటర్లను ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి, ప్రతీ దవాఖానాలో ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను

పల్లె దవాఖానాకు వైద్యులు దూరం

సంగారెడ్డి జిల్లాలో 107 ఖాళీలకు 11 పోస్టులే భర్తీ


సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 28 : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కానీ పల్లెల్లో పనిచేయడానికి డాక్టర్ల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్‌సబ్‌సెంటర్లను ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి, ప్రతీ దవాఖానాలో ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను నియమించాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో 246 పల్లెదవాఖానాలు ఏర్పాటు చేయగా.. రెండు విడుతల్లో 107 డాక్టర్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈమేరకు గత నెల 29న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేసేందుకు మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం ఈ నెల 12 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 107 ఖాళీలు ఉండగా కేవలం 17 దరఖాస్తులు వచ్చాయి. వారికి ఈ నెల 27న కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో నలుగురు స్థానికేతరులను తిరస్కరించారు. ఇంకో ఇద్దరు ఇంటర్వ్యూకు గైర్హాజరయ్యారు. కేవలం 11 మందికి మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. పల్లెదవాఖానాల్లో పనిచేసిన సర్వీస్‌ భవిష్యత్తులో పరిగణలోకి రాదనే అనుమానం, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాల్సి ఉంటుందని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వెనకాడుతున్నారు. 

Updated Date - 2021-10-29T04:59:02+05:30 IST