సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత, 2009 జమిలి ఎన్నికల్లో కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాలెం శ్రీకాంత్‌రెడ్డి (58) బుధవారం మృతి

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

 2009లో కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ


కడప (సిటి), ఆగస్టు 12: సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత, 2009 జమిలి ఎన్నికల్లో కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాలెం శ్రీకాంత్‌రెడ్డి (58) బుధవారం మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లెకు చెందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు.


హైకోర్టు చీఫ్‌ జడ్జిగా రిటైర్‌ అయిన పాలెం చెన్నకేశవరెడ్డికి ఈయన మూడో కుమారుడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎంతో ప్రతిభ ఉన్న ఆయన 2009లో టీడీపీలో చేరి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన టీడీపీ వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వర్తించారు. అయితే అనంతరం ఆయన అటు పార్టీకి కాని, రాజకీయాలకు కానీ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వెలిబుచ్చారు. 

Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST