సివిల్స్‌లో పాలమూరు మెరుపులు

ABN , First Publish Date - 2022-05-31T05:37:36+05:30 IST

సివిల్స్‌ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు ఉత్తమ ర్యాంకులు సాధించారు.

సివిల్స్‌లో పాలమూరు మెరుపులు

- అమ్మానాన్న సహకారం మరువలేనిది

- లక్ష్యం కోసం కష్టపడుతున్నా 

- సివిల్‌ సర్వీసెస్‌ 488వ ర్యాంకర్‌ సంతోష్‌కుమార్‌ రెడ్డి

ఊర్కొండ, మే 30: సివిల్స్‌ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు ఉత్తమ ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని జగన్నాథ్‌ తండాకు చెందిన కోపిశెట్టి కిరణ్మయి సోమవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 56వ ర్యాంక్‌ సాధించారు. అదేవిధంగా నార్‌కర్నూలు జిల్లా ఊర్కొండ మండ లం రాచాలపల్లి గ్రామానికి చెందిన ఎన్‌. సంతోష్‌కుమార్‌రెడ్డి 488 ర్యాం కు సాధించారు. సోమవారం సివిల్‌ సర్వీస్‌ ఫలితాలు విడుదలైన సంద ర్భంగా సంతోష్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.  అమ్మానాన్న సహకారం, తన కృషివల్లే సివిల్‌ సర్వీస్‌ 488 ర్యాంకు సాధించానని చెప్పారు. ప్రాథమిక విద్య కల్వకుర్తిలో, 5 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్‌లోని భాష్యం పబ్లిక్‌ స్కూల్‌, ఇంటర్‌ నారాయణ కళాశాల, ఇంజనీరింగ్‌ సీబీఐటీలో చదివానన్నారు. ఇంజనీరింగ్‌ పూర్తయిన వెంటనే ప్లేస్‌మెంట్‌కు ప్రాఽధాన్యం ఇవ్వకుండా సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాల నే సంకల్పంతో ఢిల్లీ వెళ్లానన్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలనే లక్ష్యం ఏర్పరచుకున్నానన్నారు.  లక్ష్యం సాధించాలంటే కుటుంబ సహకా రం చాలా ఆవసరమని అన్నారు. తన తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, ఇందిరారెడ్డి చాలా ప్రోత్సహించారన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తాను సివిల్‌ సర్వీసెస్‌లో నాలుగుసార్లు ఇంటర్వ్యూలకు వెళ్లానని, మూడవ సారి ఐఆర్‌పీఎస్‌ వచ్చిందని, ఐదో దఫా సివిల్‌ సర్వీసెస్‌లో 488 ర్యాంకు సాధించానన్నారు.  మరో ఆవకాశం ఉంటుందని, ఐఏఎస్‌ కావాలనే సంకల్పం వీడనని, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని, ప్రతీ ఒక్కరు కలలుకని వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-05-31T05:37:36+05:30 IST