intelligence high alert: జమ్మూ ఆలయాలపై దాడికి పాక్ ఉగ్రవాదుల ప్లాన్

ABN , First Publish Date - 2021-07-30T18:36:07+05:30 IST

జమ్మూలోని దేవాలయాలపై దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ తాజాగా వెల్లడించింది....

intelligence high alert: జమ్మూ ఆలయాలపై దాడికి పాక్ ఉగ్రవాదుల ప్లాన్

జమ్మూ: జమ్మూలోని దేవాలయాలపై దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ తాజాగా వెల్లడించింది. జమ్మూకశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్లు గడచిన సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం పురస్కరించుకొని జమ్మూలోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్రవాద సంస్థలు దాడుల చేయవచ్చని భారత గూఢాచార వర్గాలు హెచ్చరించాయి. పాక్ మద్ధతు ఉన్న జైషే మహ్మద్, లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థలు దాడులకు వ్యూహం పన్నాయని సమాచారం అందింది. దీంతో ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికలతో జమ్మూలో హైఅలర్ట్ ప్రకటించారు. 


జమ్మూలోని దేవాలయాలున్న రద్దీ ప్రదేశాల్లో పాక్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను అమర్చిన డ్రోన్లతో దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించాయని భద్రతా అధికారులు చెప్పారు. ఫిబ్రవరి నెలలో పాత జమ్మూ నగరంలోని బస్తాండ్ ప్రాంతంలో 7 కిలోల పేలుడు పరికరాన్ని పోలీసులు కనుగొని ఇద్దరిని అరెస్ట్ చేశారు.ఇటీవల జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద డ్రోన్లు కనిపించాయి.జమ్మూలోని ప్రసిద్ధ రఘునాథ్ ఆలయంపై ఉగ్రదాడి జరగవచ్చని పోలీసులు హెచ్చరించారు.దీంతో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించాయి.


Updated Date - 2021-07-30T18:36:07+05:30 IST