అఫ్ఘానిస్థాన్‌కు పాక్ విమాన సర్వీసులు నిలిపివేత!

ABN , First Publish Date - 2021-08-23T01:01:43+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తాజాగా ప్రకటించింది.

అఫ్ఘానిస్థాన్‌కు పాక్ విమాన సర్వీసులు నిలిపివేత!

ఇస్లామాబాద్: అఫ్ఘానిస్థాన్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తాజాగా ప్రకటించింది. రాజధాని కాబూల్‌లో ఉన్న హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టార్మాక్(విమానాలను నిలిపి ఉంచే స్థలం) అంతా చెత్తాచెదారంతో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఐఏ పేర్కొంది. ఇక ఎయిర్ పోర్టు భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అమెరికా దళాలు..మిలిటరీ విమానాల రాకపోకలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాయి. మరోవైపు..తాలిబన్ల రాకతో ఎయిర్ పోర్టు పారిశుధ్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదని సమాచారం.  కాగా.. పీఐఏ ఇప్పటివరకూ 1200 మందిని అప్ఘానిస్థాన్ నుంచి తరలించినట్టు పాక్ ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-08-23T01:01:43+05:30 IST