భారత ప్రయాణికులపై పాక్ నిషేధం

ABN , First Publish Date - 2021-06-14T02:35:58+05:30 IST

మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం విధించింది. 26 దేశాలకు సంబంధించిన ప్రయాణికుల

భారత ప్రయాణికులపై పాక్ నిషేధం

న్యూఢిల్లీ: మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం విధించింది. 26 దేశాలకు సంబంధించిన ప్రయాణికులపై బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ 26 దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలతోపాటు ఇండియా కూడా ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణిలను ఉద్దేశించి కూడా కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ 26 దేశాలు మినహా.. ఇతర దేశాల ప్రయాణికులకు నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో వెయ్యికిపైగా కొవిడ్ కేసులు నమోదవ్వగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 9.41లక్షలకు చేరింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 21,689కి చేరింది. 


Updated Date - 2021-06-14T02:35:58+05:30 IST