పద్మక్క... సాయంలో పెద్దక్క

ABN , First Publish Date - 2020-10-07T18:33:45+05:30 IST

నగరానికి చెందిన సరిపల్లి పద్మజా రెడ్డి.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ.. సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ‘పద్మక్క’ అంటూ జనం ఆప్యాయంగా పిలచుకుంటుంటారు. లాక్‌డౌన్ సమయంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడమేకాకుండా.. ఆర్థిక సాయమూ అందించారు.

పద్మక్క... సాయంలో పెద్దక్క

హైదరాబాద్: నగరానికి చెందిన సరిపల్లి పద్మజా రెడ్డి.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ.. సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ‘పద్మక్క’ అంటూ జనం ఆప్యాయంగా పిలచుకుంటుంటారు.  లాక్‌డౌన్ సమయంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడమేకాకుండా.. ఆర్థిక సాయమూ అందించారు. బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఆమె సుపరిచితురాలు. వ్యవసాయం కుటుంబ నేపథ్యం ఆమెది. సామాన్య ప్రజలు పడే కష్టాలను త్వరగా అర్థం చేసుకుంటూ.. తన వంతు సాయాన్ని అందిస్తున్నారు. 


పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వయో వృద్ధులు, ఆనాథలు, మానసిక వికలాంగులకు సేవలందిస్తున్న కోటి గ్రూప్ వారి ‘సేవా ఫౌండేషన్’కు ఈమె ట్రస్టీగా ఉన్నారు. సేవా ఫౌండేషన్ సహకారంతోపాటు, కోటి గ్రూప్‌కు చెందిన భారత్ హెల్త్ కేర్ లాబొరేటరీస్ ప్రై లిమిటెడ్‌ల  సంయుక్త ఆధ్వర్యంలో ‘బ్లడ్ డాట్ లైవ్’ను ప్రారంభించగా దీని ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.  


రక్తదాన ఆవశ్యకతపై ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ... చుట్టు పక్కల ఉన్న స్వచ్చంద రక్తదాతలతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తదానాన్ని ప్రాణదానంగా మార్చడమే ‘బ్లడ్ డాట్ లైవ్’ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు. రక్తం పంచి ఇద్దరు పిల్లలను కన్న తల్లిగా ప్రాణం విలువేంటో తనకు తెలుసని ఉద్వేగానికి గురయ్యారు. చుట్టూ ఉన్నవారి ప్రాణాలను కాపాడే విధంగా ‘బ్లడ్ డాట్ లైవ్’ రియల్ టైం లైఫ్ సేవింగ్ ప్లాట్ ఫామ్‌ను తయారు చేశామని ఆమె చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో బాధితులకు సాయం అందించడానికి ప్లాస్మా డొనేషన్ చేసే వారి వివరాలను సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందించారు.


మహిళల్లో పలు అంశాలపై అవగాహన కల్పించేవిధంగా  పద్మజా రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆడవాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమేకాదు.. అవసరమైతే.. అవకాశాలు సృష్టించాలంటూ మహిళాలోకాన్ని ముందుకు నడిపిస్తున్నారు సరిపల్లి పద్మజారెడ్డి.

Updated Date - 2020-10-07T18:33:45+05:30 IST