Abn logo
Apr 11 2021 @ 01:19AM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్ద ఉల్లగల్లు (ముండ్లమూరు), ఏప్రిల్‌ 10 : మండలంలోని పెద ఉల్లగల్లులో శనివారం డీఆర్‌డీఏ వైఎ్‌సఆర్‌ క్రాంతి పథకం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్‌ యనమల నాగేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు.  రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకొని అమ్ముకోవాలన్నారు. ఎస్‌ఆర్‌పీ  శ్రీలక్ష్మి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింస్తామన్నారు. కార్యక్రమంలో సీసీ పీ.గురవయ్య, గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు కుంటా పేరమ్మ, శారమ్మ, వీవోఏలు జిల్లెలమూడి శ్రావణి, వీరంరెడ్డి శివపార్వతి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement