Advertisement
Advertisement
Abn logo
Advertisement

పడకేసిన పారిశుధ్యం

అనారోగ్యంతో గ్రామస్థుల సతమతం 

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 5 : మండలంలోని కాపులూరు గ్రామంలో దాదాపు 50 మంది వాంతులు, విరోచనాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా గ్రామంలో ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నా  ఏ అధికారి తమ వంక చూడలేదని వాపోతున్నారు. ఆదివారం పరిస్థితి మరీ తీవ్రం కావడంతో నీరసించిన గ్రామస్థులు  పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని ఆశ్రయించారు. పారిశుధ్యంతోపాటు  తాగునీటి  కాలుష్యం సమస్య కూడా ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టిసారించడంతోపాటు తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. 


Advertisement
Advertisement