'Drugs on cruise' case: ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్‌పై చిదంబరం స్పందన

ABN , First Publish Date - 2022-05-28T19:34:50+05:30 IST

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan

'Drugs on cruise' case: ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్‌పై చిదంబరం స్పందన

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ (Congress) నేత పి చిదంబరం (P. Chidambaram) శనివారం స్పందించారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసి, 25 రోజులపాటు ఏ విధంగా జైలులో పెట్టారని ప్రశ్నించారు. 


ఆర్యన్ ఖాన్ గత ఏడాది క్రూయిజ్ నౌకపై మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు నమోదైన కేసులో ఆయన 22 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆయనకు ఎన్‌సీబీ శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతోపాటు మరో ఐదుగురికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. 


ఈ నేపథ్యంలో చిదంబరం శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌పై ఆరోపణలను దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుందన్నారు. దీనికి కారణం ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడమని చెప్పిందన్నారు. ఎటువంటి సాక్ష్యం లేకుండా ఆయనను 25 రోజులపాటు ఏ విధంగా జైలులో ఉంచారని ప్రశ్నించారు. 


ఇదే అంశంపై శుక్రవారం చిదంబరం స్పందిస్తూ, ఆర్యన్ ఖాన్ అనుభవించిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చాలా కేసుల్లో ముందుగా అరెస్టు చేస్తున్నారని, ఆ తర్వాత దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఇది చట్టం ద్వారా ఏర్పాటైన విధానాన్ని పక్కదారి పట్టించడమేనని తెలిపారు. 


Updated Date - 2022-05-28T19:34:50+05:30 IST