హోటల్స్‌కు చెల్లింపులు రద్దు చేసిన ‘ఓయో’

ABN , First Publish Date - 2020-04-04T22:15:57+05:30 IST

ఈ విషయమై మార్చి 28నే హోటల్ యాజమాన్యాలకు ఓయో నుంచి లేఖలు వెళ్లాయని, అందులో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై వివరించనట్లు ఓయో ప్రతినిధి ఒకరు తెలిపారు. హోటళ్ల ఆదాయాలు ఇప్పటికే బాగా క్షీణించాయి. కాగా, రాబోయే కొద్ది నెలల్లో ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు

హోటల్స్‌కు చెల్లింపులు రద్దు చేసిన ‘ఓయో’

న్యూఢిల్లీ: హోటల్ యాజమాన్యాలకు చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు ప్రముఖ వ్యాపార సంస్థ ‘ఓయో’ ప్రకటించింది. హోటల్ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న ఓయో కొంత కాలంగా ఆదాయం కోల్పోయింది. కరోనా వల్ల తన వ్యాపారం దాదాపుగా నిలిచిపోయిందని అందుకే హోటల్స్‌కు చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు ఓయో యాజమాన్యం పేర్కొంది.


ఈ విషయమై మార్చి 28నే హోటల్ యాజమాన్యాలకు ఓయో నుంచి లేఖలు వెళ్లాయని, అందులో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై వివరించనట్లు ఓయో ప్రతినిధి ఒకరు తెలిపారు. హోటళ్ల ఆదాయాలు ఇప్పటికే బాగా క్షీణించాయి. కాగా, రాబోయే కొద్ది నెలల్లో ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు లేవని ఓయో భావిస్తోంది. ఫోర్స్ మెజర్ హక్కులను వినియోగించుకోవడంతో పాటు నెలవారీ బెంచ్‌మార్క్ రాబటి చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఓయో పేర్కొంది.

Updated Date - 2020-04-04T22:15:57+05:30 IST