Abn logo
May 14 2021 @ 00:37AM

తిరుపతిలో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌ : కలెక్టర్‌

చిత్తూరు రూరల్‌, మే 13: జిల్లాలో ఆక్సిజన్‌ వల్ల ఎక్కడా.. ఎవరికీ ఇబ్బంది రానీయమని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఇందుకోసమే తిరుపతిలో ఆక్సిజన్‌ వార్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల అవసరానికి తగ్గట్టుగా ఆక్సిజన్‌ సరఫరా జరుగుతోంది. ఎక్కడా కొరత లేదు. ఆక్సిజన్‌ బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించడానికి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఆక్సిజన్‌ సరఫరలో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది’ అని గురువారం ఒక  ప్రకటనలో కలెక్టర్‌ పేర్కొన్నారు. 

Advertisement