Abn logo
May 6 2021 @ 21:31PM

ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్ల అందజేత

ఆక్సిజన్‌ సిలిండర్లను సబ్‌కలెక్టర్‌కు అందజేస్తున్న కనుమూరు ట్రస్ట్‌ సభ్యులు

గూడూరురూరల్‌, మే 6: స్థానిక ఏరియా ఆసుపత్రికి కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ గురువారం 39 ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేసింది. స్థానిక సబ్‌కలెక్టక్‌ కార్యాలయం వద్ద సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ వీటిని ఆస్పత్రి ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ ప్రతినిధి దేవానంద్‌ మాట్లాడుతూ  ఇప్పటిదాకా 171 సిలిండర్లను రీఫిల్‌ చేసి అందజేశామన్నారు. కార్యక్రమంలో పెంచలరెడ్డి, ఉదయ్‌కుమార్‌, శ్రీవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement