Advertisement
Advertisement
Abn logo
Advertisement

శానిటైజర్‌లా జేబులో ఇమిడిపోయే ఆక్సిజన్ బాటిల్... ఆవిష్కరించిన ఐఐటీ పూర్వ విద్యార్థి!

కాన్పూర్: కరోనా సెకెండ్ వేవ్ భారత్‌లో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు పలు అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలారు. ఆక్సిజన్ కొరతతో దేశమంతా తల్లడిల్లిపోయింది. ప్రస్తుతానికి కేసులు తగ్గుతున్నా, కరోనా వైరస్ ఇంకా మన మధ్యనే ఉంది. మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. 

అయితే ఇకపై శానిటైజర్‌తో పాటు ఆక్సిజన్ బాటిల్‌ను జేబులో పెట్టుకుని, వెంట తీసుకుని వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఐఐటీ కాన్సూర్ పూర్వ విద్యార్థి, ఈ- స్పిన్ నానోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ డాక్టర్ సందీప్ పాటిల్ ఆక్సీరైజ్ పేరిట ఒక నూతన ఉత్పత్తిని ఆవిష్కరించారు. ఎవరికైనా అనారోగ్యం వాటిల్లినప్పుడు ఈ బాటిల్‌లోని ఆక్సిజన్ షాట్స్ అందిస్తూ, ఆసుపత్రికి తరలించవచ్చు. దీని ధర రూ. 499 గా నిర్థారించారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ఈ పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ బాధితులకు అత్యవసర సమయాల్లో వినియోగమవుతుందన్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement