ఆక్సిజన్‌ సిలెండర్ల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-05-16T06:03:49+05:30 IST

వినుకొండలో కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం పేరుకే ఆరు ప్రైవేటు వైద్యశాలలతో పాటు ఒక ప్రభుత్వ వైద్యశాలను కొవిడ్‌ ఆసుపత్రిగా గుర్తించి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నారు.

ఆక్సిజన్‌ సిలెండర్ల కోసం ఎదురుచూపులు
ఆక్సిజన్‌ కోసం అరుగులపైనే కాలం వెల్లదీస్తున్న బాధితుడు

వినుకొండటౌన్‌, మే 15 : వినుకొండలో కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం పేరుకే ఆరు ప్రైవేటు వైద్యశాలలతో పాటు ఒక ప్రభుత్వ వైద్యశాలను కొవిడ్‌ ఆసుపత్రిగా గుర్తించి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. వైద్యశాలల్లో ఆక్సిజన్‌ సిలెండర్లకు డిమాండ్‌ పెరగడంతో పాటు మరికొన్ని ఆసుపత్రిల్లో ఆక్సిజన్‌ సరఫరా చేసే పైపులు సక్రమంగా పనిచేయకపోవడంతో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని ప్రైవేటు వైద్యశాలల వైద్యులు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతి ప్రైవేటు వైద్యశాలకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించినప్పటికీ వైద్యశాలల్లో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా చేతులు పైకెత్తుతున్నారు. కొందరు కొవిడ్‌ బాధితుల ఆరోగ్యం విషమించడం, ఆక్సిజన్‌ కోసం ఆరా తీసినప్పటికీ సమాచారం అందించే నాధుడు లేకపోవడంతో చివరకు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని స్ర్టెక్చర్‌లపై, అరుగులపై ఆక్సిజన్‌ కోసం సమయం గడపాల్సిన పరిస్థితి వినుకొండలో నెలకొని ఉంది. ఇప్పటికైనా బాధితుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్‌ సరఫరాపై అధికారులు చొరవ తీసుకొని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కొవిడ్‌ బాధిత బంధువులు వాపోతున్నారు.  

Updated Date - 2021-05-16T06:03:49+05:30 IST