రష్యాలో నిరసనలు: 1,100 మంది నిర్బంధం

ABN , First Publish Date - 2022-03-07T02:04:22+05:30 IST

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు వ్యతిరేకంగా స్వదేశంలోనూ నిరసనల సెగలను రష్యా చవిచూస్తోంది. రష్యా సైనిక..

రష్యాలో నిరసనలు: 1,100 మంది నిర్బంధం

మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు వ్యతిరేకంగా స్వదేశంలోనూ నిరసనల సెగలను రష్యా చవిచూస్తోంది. రష్యా సైనిక చర్యకు నిరనగా 35 సిటీల్లో ఆదివారంనాడు నిరసనలకు దిగిన 1,100 మందిని అల్లర్ల నిరోధక బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నట్టు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వీరిలో ఎక్కువ మందిని సైబేరియన్ సిటీ నోవోసైబిర్స్క్, యెకటెరిన్‌బర్గ్‌లలో అదుపులోనికి తీసుకున్నారు. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని స్క్వేర్‌ల వద్ద గుమిగూడిన వారిని కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు.


చట్టవిరుద్ధంగా ప్రదర్శనలు నిర్వహిస్తే కఠినంగా అణిచివేయడంతో పాటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని రష్యా పోలీసులు  ఇప్పడికే హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిబ్రవరి 24న ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 10,000 మంది నిరసన ప్రదర్శకులను పోలీసులు అరెస్టు చేశారు. జైలు శిక్ష అమలు చేస్తామంటూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ రోజువారీ నిరసనలు మాత్రం ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి.  కాగా, రష్యా ఆర్మీపై తప్పుడు వార్తలు ప్రచురించే వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించే ఒక బిల్లుపై పుతిన్ గత శుక్రవారంనాడు సంతకం చేశారు.

Updated Date - 2022-03-07T02:04:22+05:30 IST