అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకే మా మద్దతు

ABN , First Publish Date - 2022-05-28T05:14:18+05:30 IST

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకే మా మద్దతు ఉంటుందని ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు ప్రకటించారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకే మా మద్దతు
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు అంబేడ్కర్‌ ప్లెక్సీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాల నేతలు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోబహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నేతలు

ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌

రాయచోటిటౌన్‌, మే27: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకే మా మద్దతు ఉంటుందని ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు ప్రకటించారు. శుక్రవా రం అన్నమయ్య జిల్లా కేంద్రం ఎన్జీఓ హోంలో బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నేతలు పల్లం రామచంద్ర, రాయచోటి రవిశంకర్‌, రజాక్‌, రమణ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకే మా మద్ధతు ఉంటుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత విశ్వవిజ్ఞాని అంబేడ్కర్‌ పేరును కోనసీ మ జిల్లాకు పెట్టడం తెలుగు ప్రజలకు గర్వకారణమని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

అంబేడ్కర్‌ జిల్లాకు వ్యతిరేకంగా చేసే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామన్నారు. దళితుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే అసాంఘిక శక్తులు అంబేడ్కర్‌ జిల్లాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాయన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ పోరాటం కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ క్రమశిక్షణా సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ఎస్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రనాధ్‌రెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మండెం సుధీర్‌కుమార్‌, దళిత బహుజన ఫ్రంట్‌ నేతలు జగన్‌, దళిత మిత్రనేతలు కేశవ్‌, రాజా, మైనార్టీ హక్కుల పోరాట సమితి నేతలు సగీర్‌, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్‌, సమత సైనిక్‌ దళ్‌ నేతలు ఎం. రవిశంకర్‌, మదన్‌మోహన్‌, యూటీఎఫ్‌ గౌస్‌, యూత్‌ ఐకాన్‌ వినయ్‌కుమార్‌, రమణ పాల్గొన్నారు. 

ప్రజా సంఘాల ఐక్యవేదిక....

 రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ అరాచక అసమర్థ పాలనతోనే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు వద్దని అవమానకర పద్ధతిలో పథకం ప్రకారం కోనసీమలో అరాచకం జరిగిందని  ప్రజా సం ఘాల ఐక్యవేదిక ఆరోపించింది. అంబేడ్కర్‌ ప్లెక్సీ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ అంబేడ్కర్‌ మీద నిజంగా ప్రేమ ఉంటే మొదట్లోనే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉండేవారన్నారు. పాలకవర్గాలే ప్రజ ల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రభుత్వ అసమర్థ పాలన, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను పక్కదారి పట్టించేందుకే కోనసీమ అలజ డి లేపారని వారు విమర్శించారు. నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు పేరు, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌పేరు, విజయనగరం జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు, కడప జిల్లాకు వైఎ్‌సఆర్‌ పేరు, రాయచోటి జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినప్పుడు లేని అభ్యంతరం కోనసీమ జిల్లా కు ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ పేరు పెట్టగా ఎందుకు ఇబ్బంది కలిగిందో వ్యతిరేకిస్తున్న వా రు సమాధానం చెప్పాలన్నారు. ఏది ఏమైనా కోనసీమ జిల్లాను అబేడ్కర్‌ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నేత రామాంజనేయులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సం స్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్‌, న్యాయవాదులు నాగరాజ, వెంకట్రమణ, రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్‌, వడ్డెర విద్యావంతు ల వేదిక చల్లారెడ్డెయ్య, బీఎస్పీ నేత ఆంజనేయులు, ఎంఆర్‌పీఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:14:18+05:30 IST