మన అప్పు... 559 బిలియన్ డాలర్లు..

ABN , First Publish Date - 2020-09-20T23:14:32+05:30 IST

మొన్నటి మార్చి నాటికి మన విదేశీ రుణాలు 559 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఇందులో ఎక్కువగా వాణిజ్య రుణాలున్నాయి. ఇక... ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం రుణభారం రూ. 1,01.3 లక్షల కోట్లు కాగా, అందులో విదేశీ రుణభారం రూ. 41.88 లక్షల కోట్లుగా ఉంది. కిందటి సంవత్సరం మార్చి చివరి నాటికి మొత్తం రుణభారం రూ. 94.6 లక్షల కోట్లు ఉండగా, విదేశీ రుణభారం రూ. 41.73 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎక్స్ట‌టర్నల్ డెబిట్స్‌తో ఫారెన్ కరెన్సీ రిజర్వ్ రేషియం 85.5 శాతంగా ఉంది.

మన అప్పు... 559 బిలియన్ డాలర్లు..

ఢిల్లీ : మొన్నటి మార్చి నాటికి మన విదేశీ రుణాలు 559 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఇందులో ఎక్కువగా వాణిజ్య రుణాలున్నాయి. ఇక... ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం రుణభారం రూ. 1,01.3 లక్షల కోట్లు కాగా, అందులో విదేశీ రుణభారం రూ. 41.88 లక్షల కోట్లుగా ఉంది.


కిందటి సంవత్సరం మార్చి చివరి నాటికి మొత్తం రుణభారం రూ. 94.6 లక్షల కోట్లు ఉండగా, విదేశీ రుణభారం రూ. 41.73 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎక్స్ట‌టర్నల్ డెబిట్స్‌తో ఫారెన్ కరెన్సీ రిజర్వ్ రేషియం 85.5 శాతంగా ఉంది.


అంతకుముందు సంవత్సరంలో ఇది 76 శాతంగా ఉంది. జీడీపీలో విదేశీ రుణాల రేషియో 2020 మార్చి చివరి నాటికి 20.6 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 19.8 శాతంగా ఉంది. ఈ మేరకు ఇండియా ఎక్స్‌టర్నల్ డెబిట్స్ ‘ఎ స్టేటస్ రిపోర్ట్ : 2020-21 రిపోర్ట్ వెల్లడించింది. ఇక... 2019 మార్చి చివరి నాటితో పోలిస్తే సావరీన్ డెబిట్స్ మూడు శాతం క్షీణించి 100.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సావరీన్ రుణాల్లో ఎక్కువగా ఉండే ద్వైపాక్షిక వనరుల వంటి రుణాలు 4.9 శాతం పెరిగి 87.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి.


నాన్ సావరీన్ రుణాలు 4.2 శాతం పెరిగి 457.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య రుణాలు సమీకరించడమే ఇందుకు కారణమని తెలిపింది. ఎన్నారై ఔట్‌స్టాండింగ్ డిపాజిట్లు 130.6 బిలియన్ డాలర్లున్నాయి. ఇది దాదాపు గత ఏడాదితో సమానం. పలు వర్థమాన మార్కెట్‌లలో ఆర్థికరంగం విస్తరిస్తుంటే విదేశీ రుణభారం పెరగడం సహజమేనని, ఇందుకు భారత్ కూడా అతీతం కాదని నివేదిక పేర్కొంది. గత కొన్నేళ్లలో ప్రైవేటు కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించుకోవడాన్ని ప్రోత్సహించేలా విధానాల్లో మార్పు చేయడంతో ప్రైవేటు విభాగంలో రుణసమీకరణ పెరిగిందని తెలిపింది.


ప్రధానంగా ఆర్థికేతర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మొత్తాల్లో రుణాలు సమీకరించినట్టు తెలిపింది. ఈ విభాగంలో మొత్తం రుణ సమీకరణలో ఆ సంస్థలు తీసుకున్న రుణాల వాటా 42 శాతం వరకు ఉంది. డిపాజిట్ సేకరించే కార్పొరేషన్‌ల ద్వారా సమీకరించిన రుణాలు 28 శాతం ఉన్నాయి. సాధారణ ప్రభుత్వ రుణాల వాటా 18.1 శాతం ఉంది. మొత్తం రుణభారంలో ఏడాదికి పైబడి మెచ్యూరిటీ కలిగిన దీర్ఘకాలిక విదేశీ రుణాల వాటా 81 శాతం ఉండగా, మిగతా 19 శాతం స్వల్పకాలిక వాణిజ్య రుణాలు. కాగా... విదేశీ రుణభారం ఏ ఏటికాయేడు తారస్థాయిలో పెరుగుతూ రావడం ఆందోళన కలిగించే విషయమేనని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-09-20T23:14:32+05:30 IST