ఓపీఎస్‌ తప్ప.. మరొకటి అంగీకరించం

ABN , First Publish Date - 2022-05-25T05:03:40+05:30 IST

పాత పెన్షన్‌ విధానం తప్ప మరో ప్రత్యామ్నాయం అంగీకరించేది లేదని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్‌, జాబీర్‌ అన్నారు.

ఓపీఎస్‌ తప్ప.. మరొకటి అంగీకరించం
సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌

 యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, జాబీర్‌

రాయచోటిటౌన్‌, మే 24: పాత పెన్షన్‌ విధానం తప్ప మరో ప్రత్యామ్నాయం అంగీకరించేది లేదని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్‌, జాబీర్‌ అన్నారు. మంగళ వారం రాయచోటి పట్టణంలోని ఎన్జీవో హోంలో జరిగిన యూటీఎఫ్‌ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లా డుతూ శాస్త్రబద్ధంగా లేని జీపీఎస్‌ లాంటి ప్రత్యామ్నాయ విధానాలు ఉద్యో గ, ఉపాధ్యాయులకు మోసం చేయటా నికి తప్ప మరొకటి కాదన్నారు. 2004 సెప్టెంబరు తరువాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరినీ ఓటీఎస్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఎస్‌డీఎల్‌కు కడుతున్న పది శాతం కంట్రిబ్యూషన్‌ను ఆపి జీపీఎఫ్‌ ఖాతాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల విలీనం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు విద్యారంగానికి చెందిన నిపుణులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకొంటే మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె మండల ప్రధాన కార్యదర్శి శంకరయ్య, సంబేపల్లె మండల అధ్యక్షులు గౌస్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:03:40+05:30 IST