ఓటీఎస్ డబ్బులు ఎవరూ కట్టొద్దు: దాసరి శ్యామ్ చంద్ర

ABN , First Publish Date - 2021-12-21T00:35:34+05:30 IST

ఓటీఎస్ రద్దు కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం పట్టణ కమిటీల ఆధ్వర్యంలో అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, రావురి కృష్ణ అధ్యక్షతన..

ఓటీఎస్ డబ్బులు ఎవరూ కట్టొద్దు: దాసరి శ్యామ్ చంద్ర

జంగారెడ్డిగూడెం: ఓటీఎస్ రద్దు కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం పట్టణ కమిటీల ఆధ్వర్యంలో అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, రావురి కృష్ణ అధ్యక్షతన ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు... ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రులు లక్షలాది ఇళ్లను నిర్మిస్తే ఒక్క ఇల్లూ కట్టని ఈ ముఖ్యమంత్రి వన్ టైం సెటైల్మెంట్ పేరుతో డబ్బులు కట్టండి రిజిస్ట్రేషన్ చేస్తామనడం అత్యంత దారుణమన్నారు. నాడు ఎన్నికల్లో ఉచితంగా ఇళ్ళు ఇస్తామని చెప్పిన జగన్ హామీని గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పి ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ డబ్బులు ఎవరూ కట్టొద్దని.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల లోపే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని దాసరి శ్యామ్ చంద్ర హామీ ఇచ్చారు. ప్రజల ప్రేమ ఉంటే ముందు 28 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సూచించారు. 


ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి, బొబ్బర రాజపాల్, కుక్కల మాధవరావు, తూటికుంట రాము, బిసి సెల్ ప్రెసిడెంట్ బుసా సత్యనారాయణ, ఎస్సి సెల్ గొల్లమందల శ్రీనివాస్, గంటా రామారావు, తెలుగు యువత కార్యదర్శి సురేష్,  సీనియర్ నాయకులు పారేపల్లి నరసింహమూర్తి, డొక్క అనిల్, త్రిమూర్తులు, దూదిపాల తులసి వెంకటరమణ ,ఎలుక వరప్రసాద్, ఉండవెల్లి చందర్రావు, వేములపెళ్లి శ్రీనివాస్, షేక్ సాహెబ్, దుర్గారెడ్డి, నాగుల గూడెం గ్రామ పార్టీ అధ్యక్షుడు గోలి వెంకటరెడ్డి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ఇంద్రాణి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు. తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Updated Date - 2021-12-21T00:35:34+05:30 IST