అనాఽథ బాలలకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-31T05:53:47+05:30 IST

అనాథ, వీఽధి, మానవ ఆక్రమణకు గురైన కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల సంరక్షణ, పోషణ, బాధ్యతలు సమష్టిగా నిర్వహిద్దామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా జడ్జీ ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సంస్థ కార్యాలయం సేవా సదన్‌లో

అనాఽథ బాలలకు అండగా ఉండాలి
మాట్లాడుతున్న ఇన్‌చార్జి జిల్లా జడ్జి గోవర్ధన్‌ రెడ్డి

- ఇన్‌చార్జి జిల్లా జడ్జి గోవర్ధన్‌రెడ్డి
నిజామాబాద్‌ లీగల్‌, జూలైౖ 30: అనాథ, వీఽధి, మానవ ఆక్రమణకు గురైన కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల సంరక్షణ, పోషణ, బాధ్యతలు సమష్టిగా నిర్వహిద్దామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా జడ్జీ ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సంస్థ కార్యాలయం సేవా సదన్‌లో ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ శాఖల స్టేక్‌ హోల్డర్స్‌తో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ, పోలీసుశాఖ పిల్లల పోషణ, సంరక్షణ, సమన్వయం చేసుకుని పోలీసుశాఖ పిల్లల పోషణ సంరక్షణలో వారి భవిష్యత్తుకు గట్టి భరోసాను ఇవ్వాలని, వారి భవిషత్తు మార్గానికి భరోసా ఉండాలని తెలిపారు. కొవిడ్‌ వ్యాధి మూలంగా తల్లిదండ్రులు మరణించిన వారి పిల్లలకు ప్రత్యేక దృష్టి సారించాలని భారత సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల స్టెక్‌ హోల్డర్స్‌ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. కరోనాతో కన్నుమూసిన వారి స్థిర, చర ఆస్తులను వారి పిల్లలపై బదిలీ చేసి అధికారిక ధ్రువపత్రాలను అందజేయాలని పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల అనాధలైన వారి పిల్లల ఫొటోలు, పేర్లు, వీడియోలుదిన, టీవీ, పత్రికలలో ప్రచురించడం చట్టప్రకారం నేరమని జడ్జి తెలిపా రు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి జగన్నాథ విక్ర మ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌందర్య, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:53:47+05:30 IST