సేంద్రియ ఎరువులు పంటకు బలం

ABN , First Publish Date - 2021-06-14T05:07:51+05:30 IST

పూర్వకాలంలో మన చుట్టూ దొరికే సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేవారు.

సేంద్రియ ఎరువులు పంటకు బలం
ఘనజీవామృతం తయారు చేస్తున్న రైతులు

 కషాయాలతో చీడపీడలు దూరం

లక్కిరెడ్డిపల్లె, జూన్‌13: పూర్వకాలంలో మన చుట్టూ దొరికే  సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేవారు. వరి, వేరుశనగ, కంది, మినుము, అలసంద ప్రతిపంట సేంద్రియ ఎరువులతోనే సాగు చేసేవారు. గతంలో ఆవుపేడ, పశువుల ఎరువులు ఆకులు పంటలకు వేసేవారు. రసాయనిక ఎరువులు అసలు వేసేవారు కాదు. ప్రస్తుతం ఏ పంట సాగు చేయాలన్నా వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి రసాయనిక ఎరువులతో పంట సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులతో సాగు చేసిన పంట దిగుబడి మాత్రమే వస్తుంది. గతంలో ప్రకృతి సేంద్రియ ఎరువులతో సాగు చేసే పంటలు మంచి దిగుబడితో పాటు భూమి సారవంతంగా పెరిగేది. రాను రాను ప్రకృతి ఎరువులు వాడకం తగ్గించి రసాయనిక ఎరువులపై రైతులు మొగ్గుచూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఆరు సంవత్సరాల నుంచి మళ్లీ ప్రకృతి ఎరువులు ఉపయోగించాలని రైతులకు ప్రత్యేక అధికారులతో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆవుపేడ, పచ్చిరొట్ట కషాయలు ఘనజీవామృతం, పంచగవ్య, ద్రవజీవామృతం వీటితో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో గాండ్లపల్లె గుడ్లవారిపల్లె, పందిళ్లపల్లె, దప్పేపల్లె డీ. రామాపురం అనంతపురం ఈడిగపల్లె గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో ప్రకృతి ఎరువులతో పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో 40 మండలాల్లో 5 వేల మంది రైతులు ప్రకృతి ఎరువులతో పంటు సాగు చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో 55 మంది రైతులు కషాయలు, పచ్చిరొట్ట ఎరువులు, ఆవుపేడ, సేంద్రియ ఎరువులతోనే పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ప్రతి ఒక్క రైతు సేంద్రియం వైపు దృష్టి పెడితే పంటలు దిగుబడి కాక భూమిని సారవంతం పెరుగుతూ మానవాళి మనుగడకు పంట లు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి రైతు మన చుట్టూ జరి గే ప్రకృతి ఎరువులతో పం టలు సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చునని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-06-14T05:07:51+05:30 IST