Abn logo
Oct 2 2021 @ 09:47AM

TamilNadu:నరమాంసభక్షక పులిని చంపండి..ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ సంచలన ఆదేశాలు

చెన్నై (తమిళనాడు): నలుగురిని చంపిన నరమాంస భక్షక పులిని వెంటనే కాల్చి చంపాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శేఖర్ కుమార్ నీరజ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. గూడలూరు సమీపంలోని ఓ ఎస్టేట్ లో శుక్రవారం పులి గొర్రెల కాపరిని చంపింది. మ్యాన్ ఈటర్ అయిన పులి ఇటీవల నలుగురిని చంపడంతో అటవీశాఖ అధికారులు దాన్ని కాల్చి చంపాలని ఆదేశాలు జారీచేశారు. నరమాంస భక్షక పులిని వేటాడేందుకు కేరళకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, రెండు ఏనుగులతో 100 మంది అటవీశాఖ ఉద్యోగులు రంగంలోకి దిగారు. 

గత నెల 29వతేదీన పులి మే ఫీల్డ్ లో తిరుగుతూ మేకను చంపింది.మదుమలై టైగర్ రిజర్వుకు 40 కిలోమీటర్ల దూరంలోని అట్టకరై ప్రాంతంలో 85 ఏళ్ల వ్యక్తిని చంపడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. పులిని బంధించాలని గూడలూరు ఎమ్మెల్యే పొన్ జయసీలన్ కోరారు. మ్యాన్ ఈటర్ అయిన పులి నలుగురు వ్యక్తులతోపాటు 20 ఆవులు, ఒక మేకను చంపింది. దీంతో పులి కనిపిస్తే కాల్చివేయాలని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...