నిబంధనల మేరకే ఎంపికలు

ABN , First Publish Date - 2020-12-06T05:21:46+05:30 IST

గ్రామాల్లో రేషన్‌ ఇంటింటికీ సరఫరాకు వాహనాలు అందించే నిమిత్తం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని బీసీ కార్పొరేషన్‌ ఈడీ జి.రాజారావు తెలిపారు. మండల పరి షత్‌ కార్యాలయంలో శనివారం దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలను ఆయన పరిశీలించారు.

నిబంధనల మేరకే ఎంపికలు

బీసీ కార్పొరేషన్‌ ఈడీ  రాజారావు

ఎల్‌.ఎన్‌.పేట, డిసెంబరు 5: గ్రామాల్లో రేషన్‌ ఇంటింటికీ సరఫరాకు వాహనాలు అందించే నిమిత్తం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని  బీసీ కార్పొరేషన్‌ ఈడీ జి.రాజారావు తెలిపారు. మండల పరి షత్‌ కార్యాలయంలో శనివారం దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 38 మండలాల్లో 5,249 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 530 వాహనాల ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపికచేస్తామని చెప్పారు. 1ః10 చొప్పున దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ఆయా కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీ రుణం అందించి వాహనాలను కొనుగోలు చేయించడం జరుగు తుందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు 395 మందిని, ఎస్సీ కార్పొరే షన్‌కు 69, ఎస్టీ కార్పొరేషన్‌కు 43, ఈబీసీకి 19, మైనారిటీలకు నలుగురిని ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2020-12-06T05:21:46+05:30 IST