రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2022-05-19T04:49:52+05:30 IST

గౌరవెల్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌

 ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ 


హుస్నాబాద్‌, మే 18: గౌరవెల్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలో జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. విపక్షాల కుట్రలో భాగంగా జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసు వేశారని, ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఎన్ని అడ్డుంకులు కల్పించినా గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే నీటిని ఎత్తిపోసేందుకు మూడు మోటార్లను బిగించి డ్రై రన్‌కు సిద్ధం చేసినట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు, ఎంపీపీలు మానస, లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఎండి అన్వర్‌, వంగ వెంకట్రాంరెడ్డి, రవీందర్‌గౌడ్‌, రాంరెడ్డి పాల్గొన్నారు. కాగా హుస్నాబాద్‌ రేణుకా ఎల్లమ్మ దేవిని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. 


సబ్‌ కోర్టును ఏర్పాటు చేయండి


హుస్నాబాద్‌ పట్టణంలో సబ్‌ కోర్టును ఏర్పాటు చేయాలని బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌కు అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ప్రాంతం చుట్టూ 40 కిలోమీటర్ల వరకు సబ్‌ కోర్టు లేక కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నూతన జిల్లా కోర్టులో త్వరలో విచారణలు ప్రారంభం అవుతున్నందున ఈ ప్రాంతంలో సబ్‌ కోర్టు అవసరం ఉందన్నారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఉపాధ్యక్షుడు కన్నోజు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒగ్గోజు సదానందం, దుబ్బాక నాగరాజు, భాస్కర్‌, యాళ్ళ శ్రీనివా్‌సరెడ్డి, చిత్తారి హన్మయ్య, బాలకిషన్‌ తదితరులు ఉన్నారు.


 


Updated Date - 2022-05-19T04:49:52+05:30 IST