కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ట్రాన్స్‌కో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-10T05:49:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఓ ట్రాన్స్‌కో ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెంజల్‌ మండలం బోర్గాం గ్రామానికి చెందిన బొర్ర జగన్‌ అనే వ్యక్తి ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంపు గ్రామ సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే మంగళవారం కూడా విధులకు వెళ్లాడు. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లు వల్ల ట్రాన్స్‌కో వ్యవస్థ మొత్తంగా ప్రయివేటీకరణ దిశగా మారుతుందని, దాని వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. బ్లేడ్‌తో మెడ, కాలు, చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి ఉద్యోగులు జగన్‌ను వెంటనే బోధన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ..   ట్రాన్స్‌కో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

బోధన్‌ రూరల్‌, ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఓ ట్రాన్స్‌కో ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెంజల్‌ మండలం బోర్గాం గ్రామానికి చెందిన బొర్ర జగన్‌ అనే వ్యక్తి ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంపు గ్రామ సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే మంగళవారం కూడా విధులకు వెళ్లాడు. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లు వల్ల ట్రాన్స్‌కో వ్యవస్థ మొత్తంగా ప్రయివేటీకరణ దిశగా మారుతుందని, దాని వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. బ్లేడ్‌తో మెడ, కాలు, చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి ఉద్యోగులు జగన్‌ను వెంటనే బోధన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రాణపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో డీఈ హరిచంద్‌నాయక్‌ ఆస్పత్రికి చేరుకొని జగన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-08-10T05:49:03+05:30 IST