ఓపీ చీటీని రోగికి అందజేస్తున్న భారతి
తిరుపతి సిటీ, జూలై 1: రుయాస్పత్రిలోని పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ర్టీ మూడు విభాగాల పరిధిలో రక్తం, మలం, మూత్రం వంటివి ఒకే చోట సేకరించేలా గది నెంబర్ 100లో నూతన ఓపీ విభాగాన్ని శుక్రవారం సూపరింటెండెంట్ భారతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోగులకు అనుకూలంగా ఒకేచోట రక్త సేకరణ, పరిశోధనలు జరగాలనే ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆదేశాల మేరకు ఈ విభాగాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎంసీ వైస్ ప్రిన్సిపాల్ వెంకట్, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీలక్ష్మి, మైక్రో బయాలజీ విభాగాధిపతి డాక్టర్ వాసుదేవనాయుడు, డాక్టర్లు పాల్గొన్నారు.