Abn logo
Jul 31 2021 @ 00:27AM

తుంగ్లాంలో తాత్కాలిక ఆధార్‌ కేంద్రం ప్రారంభం

తుంగ్లాంలో ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి

అక్కిరెడ్డిపాలెం, జూలై 30: భారత పౌరులకు అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిన ఆధార్‌ కార్డులో నమోదు చేసే వ్యక్తిగత సమాచారంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని 69వ వార్డు కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి అన్నారు. ప్రజ్వల  వాణి వెల్పేర్‌ సొసైటీ, ఆధార్‌ సేవా కేంద్రం సంయుక్తంగా 69వ వార్డు తుంగ్లాం కాలనీలో ఏర్పాటు చేసిన ఆధార్‌ నమోదు కేంద్రాన్ని శుక్రవారం గోవిందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 3 వరకు నిర్వహించే ఈ కేంద్రంలో ఆధార్‌లో తప్పుల సవరణ, ఫోన్‌ నంబరు, ఫొటో మార్పు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్‌ కేంద్ర మేనేజర్‌ డీవీ శర్మ, పోలవరపు శ్రీహరి, సొసైటీ నిర్వాహకులు డాక్టర్‌ కేవీఎస్‌ సుచిత్ర, వి.అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.