నేటి నుంచి ‘ఓపెన్‌’ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-02-27T05:05:39+05:30 IST

నేటి నుంచి ‘ఓపెన్‌’ అడ్మిషన్లు

నేటి నుంచి ‘ఓపెన్‌’ అడ్మిషన్లు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ విధానంలో 2020-21 సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్య  పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రత్యేక అడ్మిషన్‌ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ లో ప్రవేశం పొందే అభ్యాసకులు దరఖాస్తు ఫా రాన్ని ఠీఠీఠీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చౌఞ్ఛుఽటఛిజిౌౌజూ.ౌటజ ద్వారా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. పదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్‌ ఫీజు (ఓసీ) పురుషుల కు రూ.1,100, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 700, ఇంటర్‌లో అడ్మిషన్‌ పొందటానికి (ఓసీ) పురుషులకు రూ.1,300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.వేయి చెల్లించాలన్నారు. అడ్మిషన్‌ పొందేందుకు ఈనెల 27 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు అడ్మిషన్‌కు తుది గడువుగా నిర్ణయించినట్లు ఆమె చెప్పారు.

Updated Date - 2021-02-27T05:05:39+05:30 IST