500 మంది విద్యార్థులకు రెండు బస్సులే

ABN , First Publish Date - 2021-12-12T05:30:00+05:30 IST

శాలిగౌరారం మండలంలోని వల్లాల ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌కు వెళ్లడానికి సరిపడా బస్సు లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.

500 మంది విద్యార్థులకు రెండు బస్సులే
వల్లాల మోడల్‌ స్కూల్‌ వద్ద బస్సు ఎక్కేందుకు బారులు తీరిన విద్యార్థులు

ఉదయం మూడు సాయంత్రం రెండు సర్వీసులు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

శాలిగౌరారం, డిసెంబరు 12: శాలిగౌరారం మండలంలోని వల్లాల ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌కు వెళ్లడానికి సరిపడా బస్సు లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ పాఠశాలలో సుమారు 500మంది విద్యార్థులు మండలంలోని పలు గ్రామాలు, వివిధ ప్రాంతాల నుం చి నిత్యం పాఠశాలకు వెళ్తుంటారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవటంతో ఇసుక ట్రాక్టర్లు, ఆటోల్లో వెళ్తూ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. శా లిగౌరారం మండలం నుంచి ఉదయం నార్కట్‌పల్లి డి పోకు చెందిన రెండు బస్సులు, నల్లగొండ డిపోకు చెంది న బస్సు విద్యార్థులను తీసుకొని పాఠశాల వద్ద దింపి నకిరేకల్‌కు వెళ్తుంటాయి. కానీ సాయంత్రం సమయం లో నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఒక్క బస్సు మాత్రమే వస్తుంది. అదే విధంగా నల్లగొండకు చెందిన ఒక్క బ స్సు మాత్రమే రావటంతో విద్యార్థులకు తిప్పలు తప్ప టం లేదు. దీంతో సాయంత్రం రెండు బస్సులు రావటం తో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ట్రాక్టర్లు, ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించటంతో తల్లిదండ్రు లు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులకు పాఠశాల ప్రి న్సిపాల్‌ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సాయంత్రం 4.30 గంటలకు నకిరేకల్‌ నుంచి శాలిగౌరారం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు సాయంత్రం కూడా మూడు బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

అదనపు బస్సుసౌకర్యం కల్పించాలి

జోగు అర్చన, 10వ తరగతి విద్యార్థి, శాలిగౌరారం

సరిపడా బస్సులు లేకపోవటంతో బ స్సులో ఇరుకుగా వెళ్లాల్సి వస్తుంది. మం డలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నిత్యం పాఠశాలకు బస్సులో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రయాణికులతో పాటు విద్యార్థులు వెళ్తుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పా ఠశాలకు బస్సులో వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఉదయం మూడు నడుస్తుండగా, సాయంత్రం రెండు బస్సు లు మాత్రమే వస్తున్నాయి. రెండు బస్సులు నడవటంతో ఇబ్బందులకు గురవుతున్నాం. సంబంధిత అధికారులు అదనపు బస్సును నకిరేకల్‌ నుంచి శాలిగౌరారం వరకు ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలి.  

Updated Date - 2021-12-12T05:30:00+05:30 IST