Abn logo
Oct 18 2021 @ 00:53AM

ఉప ఎన్నిక తర్వాతే

- టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీల ఫైనల్‌

- అధ్యక్ష పదవి కోసం పోటా పోటీ

- ఆశావహుల ముమ్మర యత్నాలు

- పూర్తయిన గ్రామ, పట్టణ, మండల కమిటీలు

జగిత్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గులాబీ పార్టీకి జిల్లా సారథి ఎంపికకు మరికొంత సమయంలో పట్టే అవకాశం ఉంది. పార్టీలో గత నెల 2వ తేదీ నుంచి సంస్థాగత సంబరాలు జరిపారు. అధిష్టానం ఆ దేశం మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, రమేశ్‌ బాబు, రవి శంకర్‌లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని 18 మండలాలు, 380 గ్రామ పం చాయతీలు, 5 మున్సిపాల్టీల్లో కమిటీలు పూర్తయ్యాయి. వార్డు స్థాయి నుంచి కమిటీల నియామకం జరిపారు. కాగా జిల్లా కమిటీ ఏర్పాటు మా త్రం ఇంకా జరగడం లేదు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం గత నెల 20వ తేది నుంచి 30వ తేది వరకు జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి కావాల్సి ఉన్న ప్పటికీ జాప్యం చోటుచేసుకుంటోంది. అధ్యక్ష పదవిని దక్కించుకునేందు కు పలువురు చోటా మోటా నేతలు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష ప దవితో పాటు జిల్లా కమిటీలో పలు పదవులను దక్కించుకోవడానికి ఆశా వహులు పావులు కదుపుతున్నారు.

అధ్యక్ష పదవిపై ఆశలు...

టీఆర్‌ఎస్‌లో సుమారు ఏడున్నర సంవత్సరాలుగా జిల్లా కమిటీలకు గ్రహణం పట్టింది. జిల్లాల పునర్విభజన తదుపరి పలుమార్లు ప్రస్తావన వచ్చినప్పటికీ కమిటీలు ప్రకటించలేదు. ఉద్యమ సమయంలో పార్టీ అధి ష్టానం నిర్ణయాలను అమలులోకి తీసుకొని రావడంలో జిల్లా కమిటీలు కీలక భూమిక వహించాయి. అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు గడుస్తున్న ప్పటికీ జిల్లా కమిటీ వేయకపోవడం ఆశావహులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎట్టకేలకు ఇటీవల జిల్లా కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చు ట్టడంతో పలువురు నేతలు ఆశలు పెంచుకున్నారు. పార్టీ కోసం పనిచేసి న నాయకులు, కార్యకర్తలు, ఉద్యమానికి మద్దతు అందించడానికి టీఆర్‌ ఎస్‌లో చేరిన పలువురు నేతలు పదవులను దక్కించుకోవడానికి ప్రయ త్నిస్తున్నారు. ఆచి తూచి పరిశీలన జరిపడంతో పాటు అర్హులైన వారికి జిల్లా కమిటీల్లో చోటు కల్పించడానికి అదిష్టానం కసరత్తులు చేస్తుండ డంతో ఆ పదవులను దక్కించుకోవడానికి పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెరపైకి పలువురి పేర్లు....

గత నెల 2వ తేదీ నుంచి జెండా పండుగతో ప్రారంభమైన సంస్థాగత నిర్మాణం వార్డు, గ్రామ, మండల, పట్టణ, డివిజన్‌ స్థాయిలో పూర్తయిన తదుపరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా అధ్యక్షుడితో పాటు సుమారు పాతిక మంది సభ్యులతో జిల్లా కమి టీని ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్డులు, గ్రామాలు, మండ లా లు, డివిజన్లలో పార్టీ శ్రేణులు ఇప్పటికే పలు కమిటీలను పూర్తి చేసి ని యోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలకు అందజేయడం తో ఆ మేరకు పదవులను ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా కమిటీ నియా మకంపై దృష్టి సారిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంలో కీలక మైన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియో జకవర్గాలతో పాటు చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని మండ లాలకు చెందిన పలువురు నేతలు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లు పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో వినిపిస్తున్నా యి. అయితే రాష్ట్ర స్థాయిలో సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు జ రుపుతూ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే జిల్లా అధ్యక్ష పదవి కేటా యింపు ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష ప దవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చొప్పదండి నియోజకవ ర్గంలోని మల్యాల మండలానికి చెందిన పోతారం సింగిల్‌ విండో చైర్మన్‌ అయిల్నేని సాగర్‌రావు, బుగ్గారం జడ్పీటీసీగా వ్యవహరిస్తున్న బాదినేని రాజేందర్‌రావు, వెల్గటూరు మాజీ ఎంపీపీ పునుగంటి శ్రీనివాస్‌రావు జి ల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. వీరితో పాటు పలువురు నేతలు సైతం అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కాగా పార్టీ అధిష్టానం తీసు కునే నిర్ణయంపైనే జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు కనిపి స్తున్నాయి. 

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాతే...

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాల్లో ఈనెలాఖరు వరకు సంస్థాగత పనులను నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ ప్రణాళిక రూపొం దించింది. గత నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వార్డు కమిటీలు, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేశారు. గత నెల 12వ తేది నుంచి 20వ తేది వరకు మండల కమిటీల నిర్మాణాలు పూర్తి చేశారు. గత నెల 20వ తేది నుంచి 30వ తేది వరకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా పార్టీ ప్రధాన విభాగంతో పాటు అనుబంధ సంఘాల పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. గత నెల 24వ తేది నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభం కావడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు స మావేశాల్లో బిజీ అయ్యారు. దీంతో జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పద వి, కార్యవర్గం ఎంపిక ఆలస్యం అయింది. అంతలోపే కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాకు చెందిన మం త్రి కొప్పులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయ కులకు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. దీంతో మ రోమారు మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు బిజీ బిజీగా ప్ర చారం చేస్తున్నారు. ఈనెల 25వ తేదిన రాజధానిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జ రగనుంది. ప్లీనరీ లోపు జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యవర్గాన్ని ప్రకటిస్తారని కొంత ప్రచారం జరిగింది. ప్లీనరీ లోపు జిల్లా కార్యవర్గం ఎంపిక జరగడం సా ధ్యం కాదని, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనంతరం జరుగు తుందని పా ర్టీ వర్గాలు అంటున్నాయి. జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్ష, కార్యవర్గ ఎ న్నిక మరికొంత ఆలస్యం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. ఉప ఎన్నిక తదుపరి జిల్లా గులాబీకి కొత్త బాస్‌ నియామకం జ రుగుతుందని వినిపిస్తోంది.