రైల్వే ఐసోలేష‌న్ కోచ్‌ల‌లో ప‌రిస్థితి ఇదీ!

ABN , First Publish Date - 2020-07-07T13:39:25+05:30 IST

రాజధాని ఢిల్లీలో తేలికపాటి క‌రోనా లక్షణాలతో బాధ‌ప‌డుతున్న రోగుల కోసం రైల్వేశాఖ స‌హ‌కారంతో కొన్ని రైలు బోగీల‌ను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చారు. అయితే ఇక్క‌డ‌కు బాధితుల‌ను...

రైల్వే ఐసోలేష‌న్ కోచ్‌ల‌లో ప‌రిస్థితి ఇదీ!

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో తేలికపాటి క‌రోనా లక్షణాలతో బాధ‌ప‌డుతున్న రోగుల కోసం రైల్వేశాఖ స‌హ‌కారంతో కొన్ని రైలు బోగీల‌ను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చారు. అయితే ఇక్క‌డ‌కు బాధితుల‌ను త‌క్కువ సంఖ్య‌లో పంపుతున్నందున ఆ కోచ్‌ల‌న్నీ స‌ద్వినియోగం కావ‌డం లేదు. ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో మొత్తం 267 రైల్వే ఐసోలేషన్ కోచ్‌లు సిద్ధం చేసిన‌ప్ప‌టికీ, ఇక్క‌డ‌కు ఒక్క రోగిని కూడా కూడా పంపలేదు. మ‌రోవైపు గ‌డ‌చిన 12 రోజుల్లో 49 మంది బాధితుల‌ను శకుర్‌బస్తీ ఐసోలేషన్ కోచ్‌లకు త‌ర‌లించారు. అంటే ప్రతిరోజూ సగటున నలుగురు బాధితుల‌ను మాత్రమే ఇక్కడకు పంపిస్తున్నార‌ని తెలుస్తోంది. కాగా ఈ కోచ్‌ల‌లో చికిత్స‌పొందుతున్న‌వారిలో 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 28 మంది బాధితులు మాత్రమే ఐసోలేషన్ కోచ్‌ల‌లో ఉన్నారు. ఈ  ఐసోలేషన్ కోచ్‌ల వాడకం తగ్గడానికి ఢిల్లీలోని వివిధ ఆసుప‌త్రుల‌లో మ‌రిన్ని ప‌డ‌క‌లు ఏర్పాటు చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 

Updated Date - 2020-07-07T13:39:25+05:30 IST