సమాచారం.. జరభద్రం

ABN , First Publish Date - 2022-01-29T18:05:02+05:30 IST

కరోనా మూలంగా ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిం ది. ఈ తరుణంలో సమాచార భద్రత అత్యంత విలువైన అంశంగా మారింది. బ్యాంకుల ఖాతాలు మొదలుకుని విలువైన వ్యక్తిగత

సమాచారం.. జరభద్రం

ఆన్‌లైన్‌లో ఏం చేసినా డేటాగానే...

గోప్యత పాటించకుంటే నష్టాలే..

వెబ్‌ పోర్టల్‌ విడుదల చేసిన ఐఎ్‌సఈఏ


హైదరాబాద్/కొత్తపేట: కరోనా మూలంగా ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిం ది. ఈ తరుణంలో సమాచార భద్రత అత్యంత విలువైన అంశంగా మారింది. బ్యాంకుల ఖాతాలు మొదలుకుని విలువైన వ్యక్తిగత సమాచారం అంతా సోషల్‌ మీడియా వేదికల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. సైబర్‌ నేరస్థులు సమాచార చోరీకి పాల్పడే అవకాశముంది. అందరికీ ఆన్‌లైన్‌ డేటా భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి జనవరి 28వ తేదీని అంతర్జాతీయ సమాచార గోప్యతా దినోత్సవం(డేటా ప్రైవసీ డే -డీపీడీ)గా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కమ్యూనికేషన్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ వారి హైదరాబాద్‌ సీ- డాక్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎ్‌సఈఏ) శుక్రవారం వెబ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీ -డాక్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.ఏ.ఎస్‌.మూర్తి, అదనపు డీజీపీ, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 


కౌన్సిల్‌ ఆఫ్‌ యూరోప్‌ సూచనలతో 

ప్రపంచం డిజటలీకరణతో అనుసంధానం కావడంతో సమాచార గోప్యత అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆన్‌లైన్‌ డేటా చౌర్యం అత్యంత ప్రభావకర నేరం గా గుర్తించిన నేపథ్యంలో తొలుత కౌన్సిల్‌ ఆఫ్‌ యూరోప్‌ సూచనలతో యూరో్‌పలో 2007 నుంచి జనవరి 28న డేటా ప్రొటెక్షన్‌ డే(డీపీడీ) నిర్వహించడం మొదలు పెట్టారు. తర్వాత విస్తరణలో భాగంగా అమెరికా, కెనెడాల్లో 2008 నుంచి యేటా జనవరి 28న డీపీడీ నిర్వహణ సైబర్‌ నేరాల నియంత్రణలో భాగంగా డేటా భద్రత, డేటా చౌర్యం, నివారణలపై అగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇలా యేటా జనవరి 28 వ తేదీని అంతర్జాతీయ సమాచార భద్రత దినోత్సవంగా పరిగణిస్తున్నారు. 


ఇలా చేయండి...

పరిచయం లేని లింక్స్‌పై క్లిక్‌ చేయవద్దు

మీకు ఎక్కువ అక్కౌంట్స్‌ ఉంటే వాటికి వేరు వేరు బలమైన పాస్‌వర్డ్స్‌ వాడాలి

అక్కౌంట్స్‌కు లాగిన్‌ కావడానికి టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వాడాలి

మీ డివై్‌సలోకి అప్లికేషన్స్‌ పొందడానికి రిమోట్‌ యాక్సెస్‌ వాడకాన్ని నివారించాలి

సోష్‌ల్‌ మీడియా వేదికలపై వ్యక్తిగత సామాచారం షేర్‌ చేసుకోవౄడంలో పరిమితులు పాటించాలి

అవసరం లేని ఫైల్స్‌ను డివైస్‌ నుంచి డిలీట్‌ చేయాలి

వివైస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి

రిమూవబుల్‌ డివై్‌స/పెన్‌డ్రైవ్స్‌లోకి కాపీ చేసే వేళ సున్నితమైన సామాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేయాలి

అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించడానికి యాక్టివ్‌ అకౌంట్స్‌ను నిత్యం గమనిస్తూ ఉండాలి

గుర్తింపును బహిర్గతం చేసే వ్యక్తిగత సమాచారాన్ని అన్‌లైన్‌లో ఎక్కడా స్టోర్‌ చేయవద్దు


ఆన్‌లైన్‌లో ఏం చేసినా డేటాగా ..

ఆన్‌లైన్‌లో ఏం చేసినా వ్యక్తిగత డేటాగా నిక్షిప్తమవుతుందన్న విషయం చాలామందికి తెలియదు. ఉదాహరణకు సాహిత్య అభిలాష ఉండేవారు ఓ వెబ్‌సైట్‌ను తరచూ చూస్తుంటే సారూప్యత ఉండే వెబ్‌సైట్ల వారూ తామిచ్చే సమాచారిన్నీ వీక్షించాలని కోరుతూ సంక్షిప్త సమాచారం పంపడం జరుగుతోంది. ఇలా వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరస్థులు తస్కరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇష్టాఇష్టాలు, ఆరోగ్య సమాచారం సహా లైసెన్స్‌, బ్యాంకుల ఖాతాలు తదితర వ్యక్తిగత సమాచారం అంతా చోరీకి గురై, నష్టం చేకూరే ప్రమాదం ఉంది. వ్యాపార లావాదేవీల్లో సమాచారం గోప్యత చాలా ప్రధానం, దాని భద్రత అత్యంత ప్రధానం. 


డేటా భద్రతకు నిపుణుల సూచనలు పాటించాలి

ఆన్‌లైన్‌ వ్యక్తిగత, కపెనీలు, వ్యాపార సంబంధ డేటా భద్రతకు నిపుణుల సూచనలు పాటించాలి. అపరిచితులు పంపే లింక్స్‌కు స్పందించవద్దు. సైబర్‌ నేరాల నివారణ అంశాలపై మా వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.ఐుఽజౌఖ్ఛిఛ్చిఠ్చీట్ఛుఽ్ఛటట.జీుఽలో మరింత సమాచారం అందుబాటులో ఉంచాం. ఎలాంటి సందేహాలున్నా టోల్‌ ఫ్రీ నెం. 18004256235కు కాల్‌ చేసిగాని మరింత సమాచారం పొందవచ్చు

-సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, అసోసియేట్‌ డైరెక్టర్‌, సీ- డాక్‌ హైదరాబాద్‌


సమాచార భద్రతకు అవగాహనే ప్రధానం

సమాచార భద్రతకు అవగాహనే ప్రధానం. ఆన్‌లైన్‌ వినియోగదారులందరూ సమాచారం భద్రతపై దృష్టి పెట్టాలి. బ్యాంకు ఖాతాలు, పాస్‌వర్డ్స్‌, ఓటీపీ తదితర వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దు సైబర్‌ నేరాల బాధితులు ఎల్‌బీనగర్‌ సైబర్‌ సెల్‌, పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్‌ నేరాలు, నివారణ, సైబర్‌ భద్రతలపైనా సైబర్‌ సెక్యూరిటీపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా డయల్‌ 100 లేదా 94906 17111 నెంబర్‌ వాట్సాప్‌ చేయవచ్చు. 

- మహేష్‌ భగవత్‌, అదనపు డీజీపీ, సీపీ రాచకొండ

Updated Date - 2022-01-29T18:05:02+05:30 IST