‘వెంగయ్య నాయుడు భార్యను పోటీకి దించుతాం’

ABN , First Publish Date - 2021-01-26T17:16:12+05:30 IST

‘గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి

‘వెంగయ్య నాయుడు భార్యను పోటీకి దించుతాం’

అన్నా.. సిద్ధమేనా?

జనసేన ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ షేక్‌ రియాజ్‌


ఒంగోలు: ‘గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తే వెంగయ్యనాయుడు భార్యను పోటీచేయిస్తాం.. దమ్ముంటే ఆమెపై గెలవాలి’ అని జనసేన ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ షేక్‌ రియాజ్‌ సోమవారం ఒక ప్రకటనలో ఆయనకు సవాల్‌ విసిరారు. పవన్‌ కల్యాణ్‌ గురించి అన్నా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాంబాబు పోటీచేస్తే టికెట్‌ ఇవ్వడానికి కూడా వైసీపీ సిద్ధంగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. భూకబ్జాలు చేసి ఆస్తులు కూడ బెట్టిన రాంబాబు నీతి నిజాయితీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌ గురించి అవాకులు, చవాకులు పేలితే తగురీతిలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు

Updated Date - 2021-01-26T17:16:12+05:30 IST