ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు
తాండూరు రూరల్, మే, 24 : తాండూరు మండలం కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగుతుంది. రెండో మంగళవారం కావడంతో వికారాబాద్ జిల్లా చుట్టు పక్కల గ్రామాలతోపాటు సరిహద్దు కర్ణాటక రాష్ట్రం భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సందీ్‌పరెడ్డి, ఈవో శేఖర్‌గౌడ్ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.