చిల్లచెట్లతో మూసుకుపోయిన శ్మశానాలు

ABN , First Publish Date - 2020-10-31T09:11:26+05:30 IST

అసలే కరోనా కాలం... నిత్యం పట్టణంలో సరాసరిన ముగ్గురునలుగురు మృత్యువాత పడుతున్న దుస్థితి. మృతదేహాలకు దహన సంస్కారాలు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

చిల్లచెట్లతో మూసుకుపోయిన శ్మశానాలు

లోపలకు అడుగుపెట్టే వీలులేక అవస్థలు 

గేటు వద్దే మృతదేహాలన్నీ పూడ్చివేత

కరోనా కాలంలో కందుకూరు

ప్రజలకు మరిన్ని ఇబ్బందులు


కందుకూరు, అక్టోబరు 30 : అసలే కరోనా కాలం... నిత్యం పట్టణంలో సరాసరిన ముగ్గురునలుగురు మృత్యువాత పడుతున్న దుస్థితి. మృతదేహాలకు దహన సంస్కారాలు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో ప్రధానంగా ఐదు శ్మశానాలు ఉండగా మూడొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న మూడింట్లోకి అడుగు పెట్టలేని దయనీయ స్థితి నెలకొని ఉంది. పోతురాజుమిట్ట శ్మశానం, గుర్రంవారిపాలెం శ్మశానంతో పాటు ఎస్సీ కాలనీల శ్మశానం చిల్లచెట్లతో నిండిచిట్టి అడవిని తలపిస్తున్నాయి. ఈ శ్మశానాలలో దహనసంస్కారాల కోసం నిర్మించిన ప్లాట్‌ఫాంలు చుట్టూ చిల్లచెట్లు దట్టంగా పెరిగి అవి కనిపించడం లేదు. గేటు పక్కనే కొద్దిపాటి స్థలాన్ని బాగు చేసుకుని అక్కడే పూడ్చేస్తున్నారు. ఆ కొద్ది స్థలంలోనే పూడ్చివేస్తుండడంతో కొన్నిసార్లు పాత మృతదేహాలు బాగా కుళ్లి బయటపడుతుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


ఒకవైపు కరోనా విపత్తు భయం వెంటాడుతుండగా, మరోవైపు శ్మశానాల్లోనూ అదే దుస్థితి నెలకొని ఉండడంపై ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నా మున్సిపల్‌ అధికారులు చూస్తూ ఊరుకుంటుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి చిల్లచెట్లను తొలగించి పరిశుభ్రం చేయించాలని కోరుతున్నారు.


అడుగు లోపలికి పెట్టే పరిస్థితి లేదు..మంగపాటి శ్రీను, పోతురాజుమిట్ట సెంటర్‌ 

సగానికి పైగా పట్టణానికి ఆధారంగా ఉన్న మూడు శ్మశానాలలో అడుగు లోపలికి పెట్టే పరిస్థితి లేదు. చిల్లచెట్లు నిండిపోయి ఉండటంతో మృతదేహాలను దహనం చేయటం సాధ్యం కావటంలేదు. కరో నా కారణంగా మృతదేహాలను ఖననం చేస్తుండగా అందుకూసరైన స్థలం లేక పడరాని పాట్లు పడుతున్నారు. సమస్యను మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు.

Updated Date - 2020-10-31T09:11:26+05:30 IST