Abn logo
Sep 29 2020 @ 05:58AM

జలకళతో బీళ్లు సస్యశ్యామలం

Kaakateeya

బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం జలకళ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఈ పథకం కింద జిల్లాకు వచ్చిన బోర్‌ డ్రిల్లింగ్‌ వాహనాలను ఆయన ఒంగోలులోని ప్రకాశం భ వన్‌ వద్ద సోమవారం జెండా ఊపి ప్రా రంభించారు. అనంతరం మాట్లాడుతూ జలకళ ద్వారా జిల్లాలో 123 గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేస్తారన్నారు.


హెక్టారులోపు పొలం ఉన్న రైతు లు వీఆర్వోలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే తక్షణమే బోర్లు మం జూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డితోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

                                                                - ఒంగోలు(కలెక్టరేట్‌)

Advertisement
Advertisement