ఎకరాకు రూ.35వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-29T06:36:11+05:30 IST

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు డిమాండ్‌ చేశారు.

ఎకరాకు రూ.35వేలు ఇవ్వాలి
ముమ్మిడివరం మండలం కొత్తలంకలో వరిపొలాలు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

ముమ్మిడివరం, నవంబరు 28: వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు డిమాండ్‌ చేశారు.  కొత్తలంకలో శనివారం వర్షాలకు నష్టపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు.  ఎకరాకు రూ.50వేలు వరకు నష్టపోయారని ఆయన అన్నారు.  కౌలురైతులందరికి నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాయకులు నడిమింటి సూర్యప్రభాకరం, పొద్దోకు నారాయణరావు, పొత్తూరి విజయభాస్కరవర్మ, కుంచనపల్లి నారాయణ, దాసరి నాగేశ్వరరావు, వీపూరి వెంకటసత్యనారాయణరాజు, గుత్తుల గోపి, గేదెల చంద్రరావు, మట్టా గోవిందరాజు, గుత్తుల మల్లిఖార్జునరావు, గుత్తుల నాగేశ్వరరావు, చిక్కాల అంజిబాబు, దివి తేజ తదితరులు పాల్గొన్నారు.

నష్టం మిగిలింది: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు పూర్తిగా నష్టపోయారు. శనివారం ఉదయం వర్షం కురవక పోవడంతో రైతులు తడిసిన వరి పంటను ఒబ్బిడి చేసుకునే పనులు చేపట్టారు. కొద్దిసేపటికే వర్షం మళ్లీ ప్రారంభం కావడంతో రైతులంతా కుదేలయ్యారు. మాసూలు చేసిన వరిధాన్యం ఎండబెట్టేందుకు అవకాశం లేకపోవడంతో కల్లాల్లోని తడిసిన ధాన్యం మొలకెత్తుతుందని, చేలల్లో ఉన్న వరి నేలనంటడంతో అవికూడా కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ హామీ ఇచ్చారు.  గాడిలంకలో శనివారం వర్షాలకు నష్టపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు.  ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా రైతులను ప్రభు త్వం తక్షణం ఆదుకోవాలని జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యుడు పితాని బాలకృష్ణ డిమాండు చేశారు. కర్రివానిరేవు, కొత్తలంక గ్రామాల్లో  పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించి నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. 



Updated Date - 2020-11-29T06:36:11+05:30 IST